కరోనా తరువాత సినిమా అంతా డిజిటల్ అంటున్న బాహుబలి నిర్మాత

కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం కొన్ని నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.మొత్తం అన్ని రకాల వ్యవస్థలు పూర్తిగా స్థంభించిపోయాయి.

 Producer Shobu Yarlagadda,after Corona Film Industry, Tollywood, South Cinema, B-TeluguStop.com

లక్షల కోట్ల రూపాయిల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.ఇక పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ లకి ఓ విధంగా ఈ కరోనా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది.

ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అయిన సినీ పరిశ్రమకి కూడా అంతులేని నష్టం మిగిల్చింది.షూటింగ్ లు ఆగిపోయాయి.

రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.

ఇన్ని అవాంతరాల మధ్య భవిష్యత్తు సినిమా ఎలా ఉండబోతుంది అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి.ఇప్పటికే సినిమాల మీద డిజిటల్ ఛానల్స్ హవా మొదలైంది.

చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినిమాలని కోనేస్తున్నాయి.

దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని నిర్మాత శోభు చెప్పారు.ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ వంటివి ఉండవని తెలిపారు.

ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్ లు, మాల్స్ కు వెళ్లడం, థియేటర్స్ కు వెళ్లడం వంటివి ఉండవని అన్నారు.అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుందని చెప్పారు.

ఇప్పటికే అందరూ డిజిటల్ బాట పట్టిన నేపధ్యంలో ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా ఇదే పద్ధతిలో నిర్మాతలు వెళ్తారనే విషయాన్ని నిర్మాత శోభు మాటల బట్టి తెలుస్తుంది.మరి ఆయన బాహుబలి తర్వాత నిర్మించిన చిన్న సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని కూడా డిజిటల్ లోనే రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube