డబ్బులులేని పవన్ ని ఎవరు పోషిస్తున్నారు?

మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన దగ్గర స్టాఫ్ కి ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే.తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో పవన్ ఒకరు.

 Sharath Marar – The Financial Support Of Pawan Kalyan-TeluguStop.com

ఎంతలేదన్నా ఒక్కో సినిమాకి 18-20 కోట్లు తీసుకుంటాడు పవన్.అంత రెమ్యునరేషన్ తీసుకున్నా, ఈ ఆర్థిక కష్టాలేంటనేది అర్థం కాని విషయమే అయినా, పవన్ నిజంగానే కష్టాల్లోనే ఉన్నాడని, పవన్ ప్రస్తుతం ఒక నిర్మాత మీద ఆధారపడి బ్రతుకుతున్నాడని ఫిలింనగర్ టాక్.

ఆ నిర్మాత పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.గోపాల గోపాల చిత్రంలో కొంచెం పెట్టుబడి పెట్టి, సర్దార్ గబ్బర్ సింగ్ తో భారి డిజాస్టర్ ని అందుకున్న శరత్ మరారే ప్రస్తుతం పవన్ ఖర్చుల బాధ్యత చూసుకుంటున్నారట.

పవన్ ఆప్తమిత్రుడైన ఈ నిర్మాత ఎస్ జే సూర్య తో మనహీరో చేయనున్న సినిమాని కూడా నిర్మించనున్న సంగతి తెలిసిందే.ఇక్కడివరకు ఎలాగోలా బండి లాక్కొచ్చిన శరత్, సూర్య సినిమా కూడా విఫలనైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికే పవన్ వలన అప్పులపాలైన శరత్, పవన్ వలన మళ్ళీ నష్టపోతే, పవన్ కి ఉన్న ఆ ఒక్క ఆర్థిక దిక్కు కూడా దూరమైపోతుందని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube