రాక్షసుడి డైరెక్టర్ కి ఖరీదైన బహుమతి ఇచ్చిన నిర్మాత...

గత సంవత్సరంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన టువంటి చిత్రం రాక్షసుడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.

 Producer Satyanarayana Koneru Gifted Villa To Director Ramesh Varma-TeluguStop.com

ఈ చిత్రం గత సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున విడుదలయింది.భారీ అంచనాల నడుమ విడుదలైన టువంటి చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అంతేకాక దర్శక నిర్మాతలకు మంచి కాసుల వర్షం కురిపించింది.అయితే ఈ చిత్రంలో తమిళ నటుడు శరవణన్, అమ్ము అభిరామి, వినోదిని, అభిరామి, కేశవ్ దీపక్,  తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం మంచి హిట్ అయి దర్శక నిర్మాతలకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాల వచ్చినందువల్ల దర్శకుడు రమేష్ వర్మకి ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత సత్యనారాయణ కోనేరు ఖరీదైన ఓ భవనాన్ని బహుమతిగా ఇచ్చాడు.అయితే ఈ భవంతి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యన్న పెరల్ లో  ఉన్నటువంటి ఓ భవంతిని దర్శకుడికి బహుమతిగా అందించారు.

ఈ భవనం దాదాపుగా 3 కోట్ల రూపాయలకి పైగా విలువ చేస్తుంది. దీంతో దర్శకుడు రమేష్ వర్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bellamkonda, Rakshasudu, Ramesh Varma, Rameshvarma, Tollywood-Movie

అయితే రమేష్ వర్మ తన కెరియర్ లో వీర, రైడ్, మల్లెపువ్వు, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా అందించాడు.అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జఫ్ఫా, అబ్బాయితో అమ్మాయి, 7, చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో రమేష్ వర్మ జోరు తగ్గినప్పటికీ రాక్షసుడు సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు.అయితే ప్రస్తుతం తన తదుపరి చిత్రం కూడా ఓ స్టార్ హీరోతో చేసేందుకు ఇప్పటికే పలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.తొందర్లోనే తన తదుపరి ప్రాజెక్టు వివరాలను కూడా అధికారికంగా వెల్లడిస్తానని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube