మహేష్ అభిమానిపై సెటైర్ వేసిన నిర్మాత నాగవంశీ.. అంతా షాక్!

Producer Nagavamshi Satire On Mahesh Babu Fan Details, , Producer Naga Vamsi, SSMB28, Mahesh Babu, Mahesh Fan, Social Media, Suryadevara Nagavamshi, Mahesh Babu Ssmb28, Director Trivikram Srinivas ,srileela, Pooja Hegde

సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB28.ప్రెజెంట్ ఇదే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

 Producer Nagavamshi Satire On Mahesh Babu Fan Details, , Producer Naga Vamsi, Ss-TeluguStop.com

మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా వాయిదా పడుతూ వస్తుంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.ఫిబ్రవరి ఎండ్ వరకు ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరగనుందట.ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.

దీంతో ఈసారి మహేష్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

Telugu Mahesh Babu, Mahesh Fan, Pooja Hegde, Naga Vamsi, Srileela, Ssmb-Movie

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఈ సినిమాపై ఒక అభిమాని చేసిన ట్వీట్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు.

Telugu Mahesh Babu, Mahesh Fan, Pooja Hegde, Naga Vamsi, Srileela, Ssmb-Movie

ఈ మధ్య కాలంలో పలు కామెంట్స్ చేసి వివాదాలు ఎదుర్కున్న నాగవంశీ తాజాగా మహేష్ అభిమాని గురించి ఒక ట్వీట్ చేసాడు.మహేష్ అభిమాని SSMB28 సినిమా మంచి సినిమా అంటూ పేర్కొంటూ ట్వీట్ చేయగా ఇందుకు నాగవంశీ రిప్లై ఇస్తూ.మీరు ఇప్పుడు ప్రొడక్షన్ ల ఉన్న సినిమాలను అంచనా వేయడం స్టార్ట్ చేసారు.

నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే రాబోయే ప్రపంచ కప్ ఫలితాన్ని కూడా చెప్పేందుకు ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube