ఒక్క శాతం తక్కువ నవ్విన టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా: నాగ వంశీ

ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి.ఇలా ఎన్నో సినిమాలు పెద్ద ఎత్తున కామెడీ నేపథ్యంలో రూపొంది అభిమానులను సందడి చేస్తూ ఉంటాయి.

 Producer Nagavamshi Interesting Comments About Mad Movie , Naga Vamsi,mad Movie,-TeluguStop.com

ఈ క్రమంలోనే అనుదీప్ ( Anudeep ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు ( Jathi Ratnalu ).సినిమా ఎలా ఆదరణ పొందిన మనకు తెలిసిందే.

ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కడుపుబ్బ నవ్వారు.ఇలా కామెడీ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Anudeep, Jathi Ratnalu, Kalyan Shankar, Mad, Naga Vamsi, Narne Nithiin-Mo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్( Narne Nithiin ) ముఖ్య పాత్రలో, పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా మ్యాడ్( MAD ). సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో తెరకెక్కింది.ఇక ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ నిర్వహించారు .

Telugu Anudeep, Jathi Ratnalu, Kalyan Shankar, Mad, Naga Vamsi, Narne Nithiin-Mo

ఇక ఈవెంట్లో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు.అలాగే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సినిమా నిర్మాత నాగ వంశి( Naga Vamsi ) మాట్లాడుతూ ఈ సినిమా థియేటర్లలో చూసి ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకుంటారని తెలిపారు.

జాతి రత్నాలు సినిమా చూసి ఎలాగైతే నవ్వుకున్నారో అంతకంటే ఒక్క శాతం కూడా నవ్వులు తగ్గవని అలా ఒక్క శాతం థియేటర్లో తక్కువ నవ్వుకుంటే వారికి నేను సినిమా టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తానంటూ చాలెంజ్ చేశారు.మరి ఎవరైనా ఈ సినిమా చూసి నవ్వలేదని ఈయనకు ట్వీట్ చేసి డబ్బులను వెనక్కి పొందుతారా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube