హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన భీమ్లా నాయక్ నిర్మాత.. కారణం అదే!

హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం డీజే టిల్లు.ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా హీరోకి ఒక ప్రశ్న ఎదురయింది.

Advertisement

ఒక మీడియా ప్రతినిధి హద్దులు దాటి మరీ ఒక ప్రశ్న వేశాడు.ట్రైలర్ లో ఒక రొమాంటిక్ సీన్ డైలాగ్ ఉంది.

అందులో హీరో ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి అని అడిగితే హీరోయిన్ 16 అని చెబుతుంది.ఆ విషయం గురించి మాట్లాడుతూ సదరు విలేకర్ ఏకంగా హీరోని ఈ విధంగా ప్రశ్నించాడు.

సినిమాలో డైలాగ్ చెప్పారు కదా!నిజంగా ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా అని అడిగాడు.ఈ ప్రశ్నకు హీరో సిద్దు జొన్నలగడ్డ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇక సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్న, అడిగిన తీరు పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ రిపోర్టర్ పై నెటిజెన్స్ మండిపడ్డారు.ఇదే విషయంపై హీరోయిన్ నేహా శెట్టి స్పందించింది.

Advertisement

ట్రైలర్ ఈవెంట్ లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం.దీనిని బట్టి అతను తన చుట్టూ ఉన్న మహిళలు ఇంట్లో వారిని ఎలా గౌరవిస్తాడో అర్థం అవుతుంది అంటూ ఆమె చురకలు అంటించింది.

అయితే హీరోయిన్ కి కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ క్షమించండి.ఇది నిజంగా చాలా దురదృష్టకరం అని తెలిపాడు.

అంతేకాకుండా నిర్మాత నాగ వంశీ కూడా సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాటుగానే సమాధానం చెప్పాడు.

తాజా వార్తలు