త్రివిక్రమ్‌, బన్నీ సినిమాని కన్ఫర్మ్‌ చేసిన స్వాతిముత్యం నిర్మాత

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి నుండి మొదలుకొని అలవైకుంఠపురంలో సినిమా వరకు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.అందుకే వారిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Producer Naga Vamshi Comments On Allu Arjun And Trivikram Movie Allu Arjun,trivi-TeluguStop.com

ఎట్టకేలకు మరో సినిమా వారిద్దరి కాంబినేషన్ లో రాబోతుంది అంటూ నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లుగా తెలియజేశారని, స్వాతిముత్యం చిత్ర నిర్మాత నాగ వంశీ పేర్కొన్నాడు.

అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్వాతిముత్యం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ త్రివిక్రమ్ తదుపరి సినిమాల గురించి అలాగే తమ బ్యానర్ లో రాబోతున్న సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Telugu Allu Arjun, Mahesh Babu, Nagavamshi, Ram Charan, Swathimuthyam, Trivikram

రామ్ చరణ్ తో ఒక భారీ సినిమా ను నిర్మించాలన్నది తన డ్రీమ్ అంటూ నాగ వంశీ తెలియజేశాడు.అదే సమయం లో త్రివిక్రమ్ గారు తన తదుపరి సినిమా ను అల్లు అర్జున్ తో చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇప్పటికే స్టోరీ లైన్స్ సిద్ధంగా ఉంది అంటూ ఆయన తెలియజేశాడు.ఇక చిరంజీవి మరియు నాగార్జున సినిమాలకు పోటీగా తమ స్వాతిముత్యం సినిమాను విడుదల చేయడం ను సమర్ధించుకున్నాడు.

సినిమా చిన్నది అయ్యుండొచ్చు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెద్దది కనుక ఈ సినిమా ను పెద్ద స్థాయి లోనే విడుదల చేస్తామంటూ స్వాతిముత్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందని, తప్పకుండా బెల్లంకొండ సాయి గణేష్ కి ఈ సినిమా సక్సెస్ తెచ్చి పెడుతుందని నిర్మాత నాగ వంశీ నమ్మకం వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube