పాయల్ వల్ల రూ.7 కోట్లు నష్టపోయానంటున్న నిర్మాత..!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ ఒకరు.పాయల్ ప్రధాన పాత్రలో నటించిన అనగనగా ఓ అతిథి సినిమా కొన్ని రోజుల క్రితం ఆహా ఓటీటీలో విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.

 Producer C Kalyan Lost 7crores Rdx Love Movie Trailer, Rdx Love Movie Trailer,pr-TeluguStop.com

అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సి కళ్యాణ్ పాయల్ తో తీసిన సినిమా వల్ల తాను 7 కోట్ల రూపాయలు నష్టపోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాయల్ ప్రధాన పాత్రలో సి కళ్యాణ్ నిర్మాతగా గతేడాది అక్టోబర్ నెల 11వ తేదీన ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్ ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో సైతం కొంచెం బోల్డ్ గానే కనిపించింది.ఆర్డీఎక్స్ లవ్ సినిమా తొలి ట్రైలర్ విడుదలైన సమయంలో పాయల్ బోల్డ్ గా కనిపించడంతో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

Telugu Rx, Kalyan, Payal Rajput, Kalyanrdx, Rdx Love-Movie

వెంకీమామ, డిస్కోరాజా లాంటి స్టార్ హీరోల ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో పాయల్ అలాంటి సినిమాల్లో నటించడం ఏమిటనే కామెంట్లు వినిపించాయి.ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ సినిమా నుంచి పాయల్ పాత్రను హైలెట్ చేస్తూ మరో ట్రైలర్ విడుదలైంది.అయితే సినిమా విడుదలైన తర్వాత నెగిటివ్ రివ్యూలు రావడం, ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా డిజాస్టర్ అయింది.

ఆ సినిమా ఫ్లాప్ కావడం గురించి సి కళ్యాణ్ స్పందిస్తూ సినిమా తొలి ట్రైలర్ విడుదలైన సమయంలో ట్రైలర్ వల్ల తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని మొర పెట్టుకుందని.

ఆ తరువాత విజయశాంతి తరహాలో ఉండే పాయల్ పాత్రతో మరో ట్రైలర్ విడుదల చేశామని.కానీ పాయల్ ను అలాంటి పాత్రలో చూడలేక ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో తనకు ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కళ్యాణ్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube