బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్... ఎన్సీబీ అధికారులపై ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు.

 Producer Kshitij Prasad Alleges Ncb, Bollywood, Bollywood Drugs Probe, Karan Joh-TeluguStop.com

ఆమె ఇచ్చిన సమాచారంతో నలుగురు హీరోయిన్స్ ని విచారించారు.అలాగే మరికొంత మందిని అరెస్ట్ చేశారు.

వారిలో నిర్మాత క్షితిజ్ ప్రసాద్ ఉన్నారు.డ్రగ్స్ డీలర్స్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.

అయితే ఇప్పుడు ఆయన ఎన్సీబీ అధికారుల మీద నేరుగా ఆరోపణలు చేసినట్లు ఓ నేషనల్ మీడియా కథనంలో పేర్కొంది.సంచలనంగా మారిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ చేపడుతున్న ఎన్సీబీ అధికారులు కావాలనే బాలీవుడ్ లో కొంత మంది ప్రముఖులని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని క్షితిజ్ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ లో సహ నిర్మాతగా గా ఉన్న క్షితిజ్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శక నిర్మాత కరణ్ పేరును తప్పుగా ఇరికించ వలసి వచ్చింది అని ఆరోపించినట్టు ప్రముఖ జాతీయ చానెల్ కథనం వేయడం విశేషం.నేను కరణ్ జోహార్, సోమెల్ మిశ్రా, రాఖీ, అపూర్వా మెహతా, నీరజ్, రాహిల్ లను ఇరికించినట్లయితే వారు నన్ను విడిచిపెడతారని ఎన్సీబి అధికారులు చెప్పారని ప్రసాద్ న్యాయవాది సతీష్ మనేషిందే ముంబై కోర్టుకు తెలిపారని సదరు చానెల్ కథనంలో ప్రసారం చేసింది.

దర్యాప్తులో ఎన్సీబీ అధికారులు ఒత్తిడి చేశారని, కరణ్ జోహార్ మాదకద్రవ్యాలను సేవించారని చెప్పాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.ఈ వ్యక్తులలో ఎవరూ వ్యక్తిగతంగా నాకు తెలియదు కాబట్టి నాపై ఒత్తిడి వచ్చినా అందుకు ససేమిరా అన్నాను.

నేను ఎవరినీ తప్పుగా ఇరికించాలని అనుకోలేదు అని ప్రసాద్ పేర్కొన్నట్లు మీడియా కథనంలో పేర్కొంది.మొత్తానికి చుట్టూ తిరిగి ఈ బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారుల మీద ఆరోపణలు చేయడం ద్వారా వారిని ఈ కేసు ఊహించని టర్న్ తీసుకుందనే టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube