ఇప్పటి వరకు ఆ విషయాలు నాకే తెలియదంటున్న మహేష్‌, జక్కన్న మూవీ నిర్మాత

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా తర్వాత జక్కన్న చేయబోతున్న సినిమా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

 Producer Kl Narayana About Rajamouli And Mahesh Babu Movie , Rajamouli, Mahesh B-TeluguStop.com

కేఎల్‌ నారాయణ నిర్మాణంలో మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి సినిమా రూపొందబోతుంది.సినిమా ప్రారంభంకు కనీసం మరో రెండేళ్ల సమయం అయినా పట్టే అవకాశం ఉంది.

అయినా కూడా ఇప్పటికే ఆ సినిమా గురించి మీడియాలో వస్తున్న పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి.మహేష్‌ బాబు కోసం కథ సిద్దం అయ్యిందని చత్రపతి శివాజీ కథతో సినిమా ను రూపొందించబోతున్నారు అంటూ కొందరు మరి కొందరు మహేష్‌ బాబును రాజమౌళి సూపర్‌ మ్యాన్‌ గా చూపించ బోతున్నాడు అంటున్నారు.

మొత్తానికి సినిమా గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సమయంలో నిర్మాత కేఎల్‌ నారాయణ మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.

ఇప్పటి వరకు రాజమౌళి తనతో కథ విషయమై చర్చించలేదు.అసలు ఆయన దృష్టి మొత్తం కూడా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా పైనే ఉంది.

ఆ సినిమా విడుదల అయితే తప్ప తదుపరి కథ గురించి ఆయన ఆలోచించడు.రాజమౌళి మహేష్‌ బాబు ల కాంబోలో నేను సినిమా చేయాల్సి ఉంది.

అది పదేళ్లుగా వాయిదాలు పడుతుంది.ఖచ్చితంగా ఈసారి మాత్రం ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందబోతున్న మహేష్‌ బాబు సినిమా కోసం మొత్తం పాన్‌ ఇండియా ఎదురు చూడటం ఖాయం.వందల కోట్ల బడ్జెట్‌ పెట్టి వేల కోట్ల వసూళ్ల రాబట్టగల సమర్థుడు జక్కన్న.

అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా కోసం మహేష్‌ కూడా వెయిట్‌ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube