రిలీజ్ కి ముందే ఆ సీనియర్ హీరో సినిమాకి భారీ నష్టాలు   Producer In Huge Loss Even Before Movie Got Released     2017-10-31   06:46:58  IST  Raghu V

సినిమా విడుదలయ్యాక డిజాస్టర్ లేదా ఫ్లాప్ టాక్ వచ్చి సినిమాలకి నష్టాలు రావడం సహజం. కొన్నిసార్లు సినిమాలకి హిట్ టాక్ వచ్చినా, హీరోకి ఉన్న మార్కెట్ కంటే ఎక్కువకి అమ్మడం వలన కూడా నష్టాలు వస్తుంటాయి. ఇది కూడా కామన్. కాని విడుదలకి ముందు నిర్మాతలు నిండా మునిగిన సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ సినిమా పేరే “PSV గరుడవేగ 126.18M”. అదేనండి, సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సినిమా.

ఆ సినిమా ట్రైలర్ చూసారా? మహేష్ – మురుగదాస్ స్పైడర్ ట్రైలర్ ఎలాగైతే ఉంటుందని ఊహించుకున్నామో, అలా ఉంది కదూ. మరి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది కదా ఈ సినిమాకి ఓ రెంజ్ లో, రాజశేఖర్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టారు అని. ఈ సినిమ బడ్జెట్ 25 కోట్లు అంట. నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాగచైతన్య లాంటి హీరోల సినిమాలకే అంత బడ్జేట్, చెప్పాలంటే అందులో సగం బడ్జెట్ కూడా సరిగా పెట్టడం లేదు మన నిర్మాతలు. అలాంటిది రాజశేఖర్ మీద 25 కోట్లు పెట్టారు.

పెట్టారు, చాలా క్వాలిటీ తో సినిమా తీసారు ఓకే. మరి కొనేవారు ఎవరు? అదేగా సమస్య. ట్రైలర్ చూసి డిమాండ్ వచ్చింది అన్న ఓవర్సీస్ లోనే కనీసం కోటి రూపాయలు పెట్టడం లేదు బయ్యర్లు. చెప్పాలంటే, 36 లక్షలకు కొన్నారని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. బయ్యర్లు లేక నిర్మాత వారిని బ్రతిమిలాడి, వీరిని బ్రతిమిలాడి సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అసలే బిజినెస్ జరగలేదంటే, ఈ రిలీజ్ ఖర్చులు అదనం.

సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి, ఓ రేంజ్ లో ఆడితే తప్ప, ఆ బడ్జెట్ కి నిర్మాతలు లాభపడతారేమో అనుకోవడం అత్యాశే ఏమో. కాని ఎవరి ఊహించగలరు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో. ఏమో, రాజశేఖర్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగిస్తారేమో, చూద్దాం మరి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.