'సాహో' గురించి భయాలు పోగొట్టిన నిర్మాతలు  

Producer Give Clarity On Sahoo Movie Release-sahoo Movie Release,uv Creations,vamsi And Pramod,సాహో

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గత రెండు సంవత్సరాలుగా ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ సాహో చిత్రం రూపొందుతోంది. బాహుబలి 2 చిత్రం తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాహోను తీయాలనే ఉద్దేశ్యంతో దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు..

ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా సినిమా మరోసారి విడుదల వాయిదా పడబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

సినిమా షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్‌ ఉందని, సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ప్రమోషన్‌ కార్యక్రమాలకు టైం ఉండటం లేదని, అందుకే సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అసలు సినిమా వాయిదా వేయాలనే ఆలోచనే తమకు లేదని యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

యూవీ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు తాజాగా సినిమా విడుదల వాయిదా విషయమై స్పందిస్తూ ఆగస్టులోనే సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

త్వరలోనే పూర్తి చేసి విడుదల చేస్తామని అన్నారు. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో నటిస్తోంది..

ఇక ఈ చిత్రం 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. మరో బాహుబలి రేంజ్‌ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.