టీఆర్ఎస్‌లోకి దిల్ రాజు.... ఆ టిక్కెట్ ఆఫ‌ర్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి విజ‌యం సాధించేందుకు ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది.ఈ క్ర‌మంలోనే ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నాయ‌కుల‌ను త‌న వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలో కేసీఆర్ ఆప‌రేష‌న్ ప‌క్కాగా జ‌రుగుతోంది.

 Producer Dil Raju To Join Trs?-TeluguStop.com

విప‌క్షాల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను భారీగానే త‌న వైపున‌కు తిప్పుకున్న కేసీఆర్ క‌న్ను ఇప్పుడు టాలీవుడ్‌పై కూడా ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత‌ను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్ ఆయ‌నకు ఎంపీ టిక్కెట్టు కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా న్యూస్ చ‌క్కెర్లు కొడుతోంది.

ఆ అగ్ర నిర్మాత ఎవ‌రో కాదు దిల్ రాజు.టాలీవుడ్‌లో మంచి క‌థాబ‌లంతో సినిమాలు తీస్తూ వ‌రుస స‌క్సెస్‌లు కొడుతున్నాడు దిల్ రాజు.

ఇటీవ‌ల దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన అన్ని సినిమాలు స‌క్సెస్ అవుతున్నాయి.ఈ యేడాది నేనే లోక‌ల్ – డీజే – ఫిదా సినిమాలు హిట్ అవ్వ‌గా త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్మించిన రాజా ది గ్రేట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇటీవ‌ల రాజు నిర్మించిన ఫిదా సినిమా చూసిన కేసీఆర్ ఫిదా అయ్యార‌ట‌.

తెలంగాణ సంస్కృతిపై ఆయ‌న‌కు ఉన్న అభిమానాన్ని మెచ్చుకున్న కేసీఆర్ ఆయ‌న‌కు ఊహించ‌ని ఆఫర్ కేసీఆర్ ఇచ్చినట్లు టీ పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆయ‌న్ను రాజ‌కీయాల్లోకి ఆహ్వానించిన కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు ఇస్తాన‌ని కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌.

కేసీఆర్ త‌న పార్టీలోకి వ‌స్తే నిజామాబాద్ లేదా జ‌హీరాబాద్ ఎంపీ సీట్ల‌లో ఏదో ఒక సీటు ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు కూడా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న క‌విత 2019 ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌నుకుంటున్నారు అదే జ‌రిగితే రాజుకు నిజామాబాద్ ఎంపీ సీటు లేక‌పోతే జ‌హీరాబాద్ సీటు అయినా ఇస్తార‌ని టాక్‌.మొత్తానికి కేసీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీతో రాజు టెంప్ట్ అవుతున్న‌ట్టు టాక్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube