మ‌డ్డి టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి: దిల్‌రాజు

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.

 Producer Dil Raju Say Muddy Movie Teaser Trailer Are Interesting Details, Produc-TeluguStop.com

లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌ 10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌ చేస్తున్నారు.ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు.విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – “మ‌డ్డి సినిమా మేకింగ్ వీడియోలు మ‌రియు టీజ‌ర్, ట్రైల‌ర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి.

అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను.మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది.ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న మ‌డ్డి అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు డా.ప్ర‌గ‌భ‌ల్ మాట్లాడుతూ – “ఒక యూనిక్ మూవీని ప్రేక్ష‌కులకు అందించాల‌ని మా టీమ్ అంద‌రం ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ మూవీని తెర‌కెక్కించాం.ఆఫ్ రోడ్ మ‌డ్ రేస్ అనేది భార‌త‌దేశంలో కొత్త కానెప్ట్ కాబ‌ట్టి ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.

Telugu Anusha Suresh, Muddy, Road, Pan India, Dil Raju, Ridhan Krishna, Svcc, Te

ముఖ్యంగా ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఈ క‌థ‌కి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది.ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది.కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజు గారికి థ్యాంక్స్‌.త‌ప్ప‌కుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధిస్తుంది”అన్నారు

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube