వినండి.. నేను రెండో పెళ్లి చేసుకోలేదంటున్న టాలీవుడ్ నిర్మాత...   

Producer Dil Raju React About His Second Marriage News - Telugu Dil Raju Marriage News, Dil Raju Movie News, Dil Raju News, Producer Dil Raju Marriage News, Tollywood News

టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి గత కొద్దికాలంగా పలు రకాల వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఎక్కువగా దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా వెబ్ సైట్లు (telugustop.com కాదు) కూడా దిల్ రాజు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా దుబాయ్ దేశంలో ఓ మహిళని రెండవ పెళ్లి చేసుకున్నాడని ఈమె కూడా భారతదేశానికి చెందినటువంటి ఓ సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన మహిళ అని పలు రకాల వార్తలు రాశారు.అయితే రోజురోజుకి ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తుండటంతో దీనిపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు.

Producer Dil Raju React About His Second Marriage News

ఇందులో భాగంగా తాను ఎవరికీ తెలియకుండా దుబాయ్ లో రెండో పెళ్లి చేసుకున్నానని వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు.అంతేగాక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్య మరణం అనంతరం తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఇప్పటి వరకూ లేదని అన్నారు.

ఒకవేళ తనకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అందరి సమక్షంలో ను చేసుకుంటానని ఇలా దొంగచాటుగా ఎక్కడికో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.అంతేగాక ఇంగ్లీషు వార్తాపత్రిక తన గురించి ఇలా రెండో పెళ్లి చేసుకున్నాడని తప్పుగా ప్రచురించిందని, దాంతో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తన గురించి ఇలాంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన టువంటి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రం ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Producer Dil Raju React About His Second Marriage News Related Telugu News,Photos/Pics,Images..

footer-test