దిల్‌రాజు మళ్లీ ఢమాల్‌!       2018-06-05   01:08:14  IST  Raghu V

సక్సెస్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన దిల్‌రాజుకు ఈమద్య ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కిడం లేదు. ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాల విషయం పక్కన పెడితే ఈయన డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇటీవల ఈయన తీసుకున్న పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. గత సంవత్సరం మహేష్‌బాబు స్పెడర్‌ చిత్రాన్ని నైజాం ఏరియాలో భారీ మొత్తానికి కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయిన దిల్‌రాజు ఈ సంవత్సరం అజ్ఞాతవాసితో పాటు పలు చిన్న చితక చిత్రాలను కొనుగోలు చేసి దాదాపుగా 65 కోట్లను నష్టపోయాడు.

కేవలం సంవత్సర కాలంలో 65 కోట్ల రూపాయలను సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో పోగొట్టుకున్న దిల్‌రాజు మరో ప్రయత్నంగా ‘కాలా’ నైజాం రైట్స్‌ను దక్కించుకున్నాడు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా రంజిత్‌ పా దర్శకత్వంలో ధనుష్‌ నిర్మించిన ‘కాలా’ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి ముందు వీరి కాంబినేషన్‌లో ‘కబాలి’ చిత్రం వచ్చింది. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. రజినీకాంత్‌తో ఇలాంటి సినిమానా తీసేది అంటూ దర్శకుడు రంజిత్‌పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడని అతడు మరో సినిమాకు ప్లాన్‌ చేశాడు.

రజినీకాంత్‌తో ఈయన చేసిన సినిమా అనగానే అంతగా ఆక్తి కనబర్చడం లేదు. కాలా సినిమాపై తెలుగు ప్రేక్షకులకు అంత మోజు లేదు. ఒక వేళ ఫ్లాప్‌ అయితే మినిమం కలెక్షన్స్‌ కూడా రావు. అయినా కూడా దిల్‌రాజు భారీ మొత్తాని పెట్టి కాలాను కొనుగోలు చేయడం జరిగింది. గతంలో జరిగిన తప్పిదనంను మళ్లీ మళ్లీ దిల్‌రాజు చేస్తున్నాడు అని, ఆయనకు గతంలో వచ్చిన ఫెయిల్యూర్స్‌ అనుభవంను నేర్పడం లేదేమో అంటూ కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాతో కూడా నష్టాలు చవిచూడాల్సిందే అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు స్పైడర్‌ చిత్రంతో ఏ రేంజ్‌లో నష్టపర్చాడో, అదే విధంగా తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కూడా దిల్‌రాజును ఆ విధంగానే నష్టపర్చడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు కొందరు భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం దిల్‌రాజుపై నమ్మకంతో ఈ సినిమా బాగుంటుందేమో అని నమ్ముతున్నారు. దిల్‌రాజు గత చిత్రాల విషయంలో తప్పు చేశాడు. కాని ఈ చిత్రం విషయంలో అలా జరగదని భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘కాలా’ తమిళంలో రికార్డులు బ్రేక్‌ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా మినిమం సక్సెస్‌ అయితే చాలనుకుంటున్నారు.