దిల్‌రాజు మాట తప్పాడు.. కళ్యాణ్‌ రామ్‌ సినిమాకు సాయం

దిల్‌ రాజుకు గత ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు.2018 సంవత్సరంలో దిల్‌రాజు నిర్మించిన సినిమాలు మరియు డిస్ట్రిబ్యూట్‌ చేసిన సినిమాలు కూడా నష్టాలను మిగిల్చాయి.అయితే ఈ ఏడాది ఆరంభంలోనే ఎఫ్‌ 2 చిత్రంతో గత ఏడాది నష్టాలన్నింటిని కూడా దిల్‌రాజు పూడ్చేసుకున్నాడు.ఎప్‌ 2 చిత్రం దాదాపుగా 55 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 Producer Dil Raju Acquires 118 Theatrical Rights-TeluguStop.com

ఎఫ్‌ 2 చిత్రం ప్రమోషన్‌ సమయంలో ఇతర సినిమాలను పంపిణీ చేసే క్రమంలో చాలా నష్టపోయామని, ఇకపై బయట సినిమాలను పంపిణీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లుగా సంచలన ప్రకటన చేశాడు.

గతంలో దిల్‌రాజు పలు చిన్న సినిమాలను పంపిణీ చేయడం వల్ల అవి మంచి విజయాలను దక్కించుకున్నాయి.

సినిమాను దిల్‌రాజు పంపిణీ చేస్తున్నాడు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్‌ ఉన్నట్లుగా భావించారు.చాలా వరకు సినిమాలు దిల్‌రాజు పేరుతో ఆడాయి.

అలాంటిది దిల్‌రాజు పంపిణీకి స్వస్థి చెబుతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు.దిల్‌రాజు నిర్ణయాన్ని పునరాలోచించాలని అంతా కోరారు.

దాంతో దిల్‌రాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

దిల్‌రాజు తాజాగా కళ్యాణ్‌ రామ్‌ నటించిన ‘118’ చిత్రం పంపిణీ హక్కులను దక్కించుకున్నాడు.తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా దిల్‌రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాడు.త్వరలోనే విడుదల కాబోతున్న కళ్యాణ్‌ రామ్‌ 118 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా దిల్‌రాజు ఆ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉండటంతో దిల్‌రాజు హోల్‌సేల్‌గా సినిమాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube