పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా.. ఏంది దానయ్య ఇది?       2018-06-16   03:46:39  IST  Raghu V

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల జాబితా తీస్తే ఖచ్చితంగా అందులో దానయ్య పేరు ముందు వరుసలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. బాహుబలి తర్వాత స్థానంను దక్కించుకున్న భరత్‌ అనే నేను చిత్రంతో నిర్మాత దానయ్య భారీ మొత్తంలో లాభాలను దక్కించుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దానయ్య రామ్‌ చరణ్‌తో బోయపాటి దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

-

ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈయన త్వరలో నిర్మించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం మరో ఎత్తు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటించబోతున్న అది పెద్ద బ్లాక్‌ బస్టర్‌ మల్టీస్టారర్‌ సినిమాను నిర్మాత దానయ్య నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లతో మల్టీస్టారర్‌ను దానయ్య నిర్మిస్తున్నాడు. ఇలా స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ ఉన్న దానయ్య టాలీవుడ్‌ టాప్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందాన ఇంత గొప్ప నిర్మాత అయిన దానయ్య తన కొడుకును చిన్న దర్శకుడి చేతిలో పెడుతున్నాడు.

నిర్మాతగా మూడు నాలుగు సక్సెస్‌లు దక్కించుకున్న బెల్లంకొండ సురేష్‌ ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ను వరుసగా స్టార్‌ దర్శకుతో సినిమాలు చేయిస్తున్నాడు. మొదటి సినిమా సక్సెస్‌ అయితేనే ఆ తర్వాత సినిమాలతో ఆకట్టుకుంటారు. ఆ విషయం దానయ్య గ్రహించకుండా తన కొడుకును ఏమాత్రం సక్సెస్‌లో లోని తేజకు అప్పగిస్తున్నాడు. స్వీయ నిర్మాణంలో తేజ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేసేందుకు దానయ్య సిద్దం అవుతున్నాడు.

దానయ్య తల్చుకుంటే స్టార్‌ దర్శకుడితో, స్టార్‌ హీరోయిన్స్‌ను పెట్టి తన కొడుకు మొదటి సినిమాను తీయగలడు. కాని అలా చేయకుండా తక్కువ బడ్జెట్‌తో, చిన్న దర్శకుడితో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటో అంటూ కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఆయన తెలివి తక్కువ తనం అని, కొడుకును సరైన మార్గంలో ఆయన నడిపించడంలో విఫలం అయ్యాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దానయ్య తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి అంటే కాస్త టైం తీసుకుని అయినా పెద్ద దర్శకుడికి అప్పగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.