నితిన్ సినిమాకు అందరూ టోపీ పెట్టారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దమ్మలపాటి శ్రీనివాసరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ద్రోణ సినిమాలో గోవా దగ్గర ఒక సెట్ వేశామని శ్రీనివాసరావు తెలిపారు.

 Producer D Srinivasarao Comments About Nitin Drona Movie-TeluguStop.com

వైజాగ్ దగ్గర సెట్ వేద్దామని చెబితే కొన్ని రీజన్స్ వల్ల గోవాలో వేయాల్సి వచ్చిందని అందులో హీరో తప్పైతే ఏమీ లేదని శ్రీనివాసరావు అన్నారు.డైరెక్టర్ వల్లే అక్కడ సెట్ వేయాల్సి వచ్చిందని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఒక నెలరోజుల ముందు సెట్ వేయడానికి వెళితే అయితే అక్కడ ఉన్నవాళ్లు వర్షాలు పడతాయని హెచ్చరించారని అయితే మేము మూర్ఖంగా వెళ్లామని శ్రీనివాసరావు తెలిపారు.అక్కడికి వెళ్లాక నాలుగు రోజులు వరుసగా వర్షాలు కురవడంతో రిటర్న్ వచ్చేశామని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

 Producer D Srinivasarao Comments About Nitin Drona Movie-నితిన్ సినిమాకు అందరూ టోపీ పెట్టారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు నెలల తరువాత ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గోవాలో వేసిన సెట్ చెక్కు చెదరకపోవడంతో మళ్లీ అక్కడే షూటింగ్ పూర్తి చేశామని శ్రీనివాసరావు వెల్లడించారు.

ఈ సినిమా ప్రొడక్షన్ సమయంలో సినిమా ఆడుతుందా? ఆడదా? అనే సందేహం ఉండదని శ్రీనివాసరావు తెలిపారు.నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మన షూటింగ్ నెల రోజులు ఆపుతున్నామని వర్మకు డేట్లు ఇచ్చామని వర్మతో చేస్తే మన సినిమాకు క్రేజ్ పెరుగుతుందని సుధాకర్ రెడ్డి చెప్పారని తాను కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని శ్రీనివాసరావు అన్నారు.కాంప్రమైజ్ కాకపోతే పనులు సరిగ్గా జరగవని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

వర్మ అడవి అనే సినిమాను తెరకెక్కించి చివరకు తన నెత్తిన టోపీ పెట్టారని శ్రీనివాసరావు తెలిపారు.ఈ కారణాల వల్ల తనకు ద్రోణ సినిమాకు నష్టాలు వచ్చాయని శ్రీనివాసరావు అన్నారు.నితిన్ కు జోడీగా ప్రియమణి ఈ సినిమాలో నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

#Sudhakar Reddy #D Srinivasa Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు