కన్ఫం: పుష్పరాజ్ ఎంట్రీ రెండు సార్లు!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

 Producer Confirms Of Pushpa Two Parts-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.అయితే ఈ క్రమంలో పుష్ప చిత్రం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గతకొద్ది రోజులుగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.

 Producer Confirms Of Pushpa Two Parts-కన్ఫం: పుష్పరాజ్ ఎంట్రీ రెండు సార్లు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.పుష్ప చిత్రానికి సెట్ అయిన కథ అద్భుతంగా ఉందని, ఈ కథను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం వీలు కాదని, అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

దీంతో పుష్ప చిత్రం గురించి వస్తున్న వార్తలు నిజమని తేలిపోయింది.ఇక పుష్ప చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా, సుకుమార్ మార్క్‌‌తో వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా ఊరమాస్ లుక్‌తో మనకు కనిపించనున్నాడు.కాగా ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తుండటంతో పుష్ప చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి పుష్ప చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

#Producer #Pushpa #Allu Arjun #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు