ప్రముఖ నిర్మాత పై కేసు నమోదు...కారణం

ప్రముఖ నిర్మాత పై మరో సినీ నిర్మాత బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.ఈ ఘటన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చోటు చేసుకోవడం గమనార్హం.నిర్మాత నట్టి కుమార్ పై మరో నిర్మాత చంటి అడ్డాల బంజారాహిల్స్ లో కేసు నమోదు చేశారు.“ఐనా ఇష్టం నువ్వు” అనే సినిమా వివాదంతోనే ఈ కేసు పెట్టినట్టు నిర్మాత చంటి అడ్డాల తెలిపాడు.“ఐనా ఇష్టం నువ్వు” సినిమా తన దగ్గర కొంటానని చెప్పి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు అంటూ పోలీసులను ఆశ్రయించాడు.ఆ సినిమా కొంటాను అని చెప్పిన ఆయన చెక్కులు ఇచ్చి, అయితే ఇప్పుడే ప్రొసీడ్ అవొద్దన్నాడని కానీ ఆ తరువాత డబ్బులు ఇవ్వలేదని .దీంతో ఫిల్మ్ ఛాంబర్ లో నట్టి కుమార్ మీద ఫిర్యాదు చేశానని చంటి అడ్డాల పేర్కొన్నాడు.అయితే మా మధ్య చేసుకున్న అగ్రిమెంట్ ను కూడా ఫిల్న్ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని అయినప్పటికీ కూడా తన పేరు తీసేసి అతని పేరు పెట్టుకున్నాడంటూ అడ్డాల తెలిపారు.

 Producer Chanti Addala Complaint Against Another Producer Natti Kumar, Chanti Ad-TeluguStop.com

తాను రిలీజ్ చేసిన పోస్టర్ అతనిదిలా క్రియేట్ చేశాడని… ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాకా కూడా తన సినిమాను అతని సినిమాగా చెప్పుకుంటున్నాడని అడ్డాల ఫైర్‌ అయ్యారు.తాను నట్టి కుమార్ అనే ఫ్రాడ్ ను నమ్మడం వల్లే ఈ రోజు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది అంటూ అతనిపై యాక్షన్ తీసుకోవాలి అని పోలీసులను కోరారు.

అయితే టాలీవుడ్ లో ఇద్దరు నిర్మాతల రచ్చ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం తో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది.మరి దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇప్పటికే మా అసోసియేషన్ గొడవలతో సతమతమౌతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు నిర్మాతల వివాదం చర్చకు దారి తీసింది.ఈ అంశాలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube