ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ ‘అద్భుతం’ : నిర్మాత చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ

ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని.

 Producer Chandrsekhar Reddy Over Adbhutam Movie Response From Audience-TeluguStop.com

అమెరికాలో ఉన్నత చదువులు చదివి.నాగార్జున, సుమంత్‌, రాజశేఖర్‌, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉంటూ.

సినిమాలపై ప్రేమను పెంచుకుని ‘అద్భుతం’ చిత్రంతో నిర్మాతగా మారారు చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ. యంగ్‌ హీరో తేజ సజ్జా, హీరో డా॥రాజశేఖర్‌ కూతురు శివాని రాజశేఖర్‌ హీరోయిన్‌గా, రామ్‌మల్లిక్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ రోమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఈనెల 19 నుంచి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

 Producer Chandrsekhar Reddy Over Adbhutam Movie Response From Audience-ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ ‘అద్భుతం’ : నిర్మాత చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను పొంది విజయవంతంగా దూసుకుపోతూ విడుదలైన 3 రోజుల్లోనే 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ ప్లస్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న సందర్భంగా ‘అద్భుతం’ చిత్ర నిర్మాత చంద్రశేఖర్‌ మొగుళ్ల తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

‘‘మా ‘అద్భుతం’ సినిమా హాట్‌స్టార్‌లో టాప్‌ వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది.

ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ నిజంగా ‘అద్భుతం’.ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులు 4, 4.5 రేటింగ్‌ ఇస్తున్నారు.ఇది నిజంగా మా టీమ్‌ చాలా సంతోషకరమైన విషయం.

అలాగే కేవలం 3 రోజుల్లో 100 మిలియన్‌ మినిట్స్‌ వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించడం మా సంతోషాన్ని మరింత పెంచింది.గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.

Telugu Adbhutam Movie, Director Ram Mallaik, Disney Hotstar Streaming, Hero Teja Sajja, Heroine Shvani Rajasekhar, Producer Chandrsekhar Reddy, Response From Audience, Tollywood-Movie

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన క్రమంలో అక్కడి ప్రజలు హెల్త్ పై తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి నేను ప్రజల ఆరోగ్యం విషయంలో యూనివర్సల్‌గా ఉన్న కొన్ని అంశాలను పరిశీలించి, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌ స్టూడియో స్థాపించాను.ఈ క్రమంలోనే అనేకమంది సినీ పెద్దలు, సెలబ్రిటీలతో పరిచయం అయ్యింది.అలా సినిమాలపై నాకు కూడా ఇంట్రస్ట్‌ పెరిగింది.

Telugu Adbhutam Movie, Director Ram Mallaik, Disney Hotstar Streaming, Hero Teja Sajja, Heroine Shvani Rajasekhar, Producer Chandrsekhar Reddy, Response From Audience, Tollywood-Movie

నా ఆలోచనలు ఎపుడూ యూనివర్సల్‌గా వర్కవుట్‌ అయ్యే విషయాల వెంటే తిరుగు తుంటాయి.అలా నేను మంచి కథ దొరికితే సినిమా నిర్మిద్దామనుకొనే టైం లో కొన్ని కథలు వినడం జరిగింది.దీనికి తగ్గట్టు దర్శకుడు రామ్‌ మల్లిక్‌ ఒక యూనివర్సల్‌ ప్రాబ్లమ్‌ వలన ఒకే ఫోన్‌ నెంబరు ఇద్దరికి రావడం, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యం మీద కథ చెప్పారు.

నాకు చాలా బాగా నచ్చింది.వెంటనే ఓకే చెప్పేశాను.ఈ కథను చెప్పినదానికంటే ‘అద్భుతం’గా తెరకెక్కించాడు దర్శకుడు.దీనికి తోడు హీరో తేజ, హీరోయిన్ శివాని మరియు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ కూడా అద్భుతంగా కుదిరారు.

వారంతా కరోనా టైం లో కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు.దాని రిజల్ట్‌ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మా ‘అద్భుతం’ విజయం.

యూనిట్‌ అందరం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

Telugu Adbhutam Movie, Director Ram Mallaik, Disney Hotstar Streaming, Hero Teja Sajja, Heroine Shvani Rajasekhar, Producer Chandrsekhar Reddy, Response From Audience, Tollywood-Movie

కథలో ఉన్న కొత్తదనం, ప్రేక్షకుల ఊహలను తలక్రిందులుగా చేస్తూ సాగిన కథనం, ప్రతి సీన్‌ ఉత్కంఠగా సాగటం వంటి కారణాలు ఇవాళ్ల  ఓటీటీలో మా సినిమా ఘన విజయం సాధించడానికి దోహదపడ్డాయి.హాట్‌స్టార్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇటువంటి కంటెంట్‌ ఉన్న సినిమాను థియేటర్స్‌లో ఎందుకు విడుదల చేయలేదు అని అడుగు తున్నారు.కరోనా సమయంలో చాలా సినిమాలు థియేటర్స్‌ ఇప్పుడే ఓపెన్‌ కావేమో అనే ఉద్దేశంతో ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెట్టాయి.

మేము కూడా అదే ఆలోచనతో హాట్‌స్టార్‌ వారితో ఒప్పందం చేసుకోవటం జరిగింది.అందుకే మేము డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేయడం జరిగింది.త్వరలో మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాము.

ఫ్యామిలీ ఓరియెంటెడ్‌, ఎమోషనల్‌, ఇన్సిపిరేషన్‌, రిలేషన్స్‌పై మూవీస్‌ చేయాలనేది నా కోరిక.

ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం.తదుపరి సినిమాకు సంబంధించి కొద్దిగా టైం తీసుకుని వివరాలు వెల్లడిస్తాను’’ అని ముగించారు.

#Adbhutam #Chandrsekhar #Disney #Mallaik #Teja Sajja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube