ఓటీటీల వల్ల స్టార్ హీరోల ఇమేజ్ కే ప్రమాదం.. నిర్మాత బన్నీ వాసు!

కరోనా మహమ్మారి సమయంలో సినిమాలు విడుదల కాక థియేటర్ లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ ఓటీటీ సంస్కృతి మొదలయ్యింది.అయితే ప్రస్తుతం కరోనా తగ్గు ముఖం పట్టడంతో కొంతమంది హీరోల సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తూ ఉండగా, మరి కొంత మంది స్టార్ హీరోలు వారి సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధపడుతుండడంతో ఈ ఓటీటీ ప్రభావంసినిమా థియేటర్లపై పడబోతోంది.

 Producer Bunny Vasu On  Ott , Producer Bunny Vasu , Tollywood , Ott , Theaters ,-TeluguStop.com

అలా ప్రస్తుతం స్టార్ సినిమా అయినా కూడా థియేటర్లు ప్రేక్షకులకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఒకవేళ ఇదే కనుక ఇలాగే కొనసాగితే మరి రానున్న రోజుల్లో థియేటర్ల వ్యవస్థ నామ రూపాలు లేకుండా పోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఓటీటీ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇదే విషయం పై నిర్మాత బన్నీవాసు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.కొత్త సినిమాలని 50 రోజుల వరకు ఓటీటీ కి ఇవ్వకూడదని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

Telugu Bunny Vasu, Bunny Vasu Ott, Otts, Theaters, Tollywood-Movie

త్వరగా కొత్త సినిమాలు ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్ల వ్యవస్థ కే కాకుండా పెద్ద హీరోలకు కూడా తీరని నష్టంగా మారే అవకాశం వుదని దాంతో స్టార్ హీరోలకున్న క్రేజ్ కూడా తగ్గే ప్రమాదం వుందన్నారు.సినిమా విడుదల విషయంలో ఓ అగ్ర హీరో నిర్మాతతో ఒప్పందం చేసుకున్నారని తన అనుమతి లేకుండా సినిమాని 50 రోజుల వరకు ఓటీటీలకు ఇవ్వోద్దని సూచించారని తెలిపారు.అలాగే సినిమాల ఓటీటీ విడుదల విషయంలో జూన్ 29 న నిర్మాతలు సమావేశం కానున్నారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube