వెయ్యి కోట్ల మహాభారతం ఆగిపోయింది! నిర్మాత అధికారిక ప్రకటన

మహాభారతం కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని ఇప్పుడు ఇండియాలో చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం ఉంటుందని చెప్పుకొచ్చారు.

 Producer Br Shetty Announced Mahabharatham Movie Stoped-TeluguStop.com

అదే తన చివరి చిత్రం కూడా అవుతుందని ప్రకటించాడు.ఇదిలా ఉంటే ఈ మహాభారత కథని ఏకంగా వెయ్యి కోట్లతో నిర్మించడానికి యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి సిద్ధం అయిన సంగతి అందరికి తెలిసిందే.

వాసుదేవన్ నాయర్ నవల రందమూజం అనే నవల ఆధారంగా భీముడు దృక్కోణం నుంచి అదే టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని భావించారు.మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ విషయం తెలిసింది.నిర్మాత శెట్టి చిత్రాన్ని నిర్మించాలన్న తన ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.

రచయిత వాసుదేవన్ నాయర్‌కు, దర్శకుడు శ్రీకుమార్ మీనన్‌కు మధ్య చిత్రానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదని, వారి మధ్య నెలకొన్న వివాదాల కారణంగా తాను ఈ గొప్ప చారిత్రక చిత్ర నిర్మాణం నుంచి వెనక్కి తగ్గినట్టు నిర్మాత ప్రకటించారు.శ్రీ కుమార్ మీనన్ చివరిగా మోహన్ లాల్ తో ఓడియన్ అనే సినిమాని తెరకెక్కించారు.ఇది కాస్తా ఫ్లాప్ అయ్యింది.ఈ కారణంగానే నిర్మాత ఈ ప్రాజెక్ట్ ని పక్కకి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube