ఇంట్లో సిలిండర్ పొరపాటున పేలితే ప్రమాద బీమా ఇలా క్లెయిమ్ చేసుకోండి..!

మనం తరుచు గ్యాస్ సిలిండర్లు పేలి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంఘటనలను చూస్తూనే ఉంటాం.వాస్తవానికి గ్యాస్ లీక్ అయిన సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని అందరికీ తెలిసిన విషయమే.

 Process To Claim The Insurance If The Lpg Cylinder Is Accidentally Blasted In Ho-TeluguStop.com

గ్యాస్ కనెక్షన్‌లో సమస్య ఉండి, గ్యాస్ లీకై మంటల వల్ల ప్రమాదాలు వస్తాయని , దీని వల్ల చాలా మందికి వారి ప్రాణాలు, ఆస్తినష్టం బారీన  పడుతూ ఉంటారు.ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఎల్పీజీ వినియోగదారుల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినప్పుడు పెట్రోలియం కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ గురించి ఒకసారి తెలుసుకుందామా మరి.

సహజంగా పెట్రోలియం కంపెనీ వద్ద ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకునే సమయంలో వినియోగదారులకు  వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తుంది.ఈ బీమా ద్వారా 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

ఏదైనా లీకేజీ ద్వారా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థిక సహాయం అందజేస్తుంది.ప్రస్తుతానికి మాత్రం హిందూస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిన్, భారత్ పెట్రోలియం సంస్థల వారు  ఎల్‌పీజీ కనెక్షన్ పై బీమా అందచేస్తునారు.

గ్యాస్ సిలిండర్లు లీకేజ్ అవ్వకుండా జాగ్రత్తగా వహించాల్సిన బాధ్యత మొత్తం కూడా పెట్రోల్ కంపెనీ, డీలర్లకు మాత్రమే.ఇది ఇలా ఉండగా గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో పెట్రోలియం కంపెనీల ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించుకోవచ్చు ఒక్కో సంఘటనకు 50 లక్షలు వరకు బీమా ను ఉండవచ్చు, అలాగే ప్రమాదం సంభవించిన సమయంలో ఎవరైనా మరణించినట్లయితే వారికి ఆరు లక్షల రూపాయల వరకు వారికీ భీమా కింద చేకూరుతుంది.

అంతే కాకుండా తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలు అందచేస్తారు.ఇది ఇలా ఉండగా నష్టపరిహారాన్ని పొందాలనుకునే వారికి కొన్ని షరతులు వర్తిస్తాయి.

అది కేవలం గ్యాస్ ఏజెన్సీ లో నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ వారు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మెడికల్ బిల్లులు ధ్రువపత్రాలను అందించడం వల్లనే బీమా క్లెయిమ్  చేసుకోవడానికి వీలుపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube