కూటమిలో తీవ్రమవుతున్న పొత్తుల పంచాయతీ !  

  • తెలంగాణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా … టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించాలనే ఉద్దేశంతో ఏర్పడిందే మహాకూటమి. విడివిడిగా పోరాడేకంటే… కలిసి పోరాడితే అధికారం కూడా కలిసే పంచుకోవచ్చనే ఆలోచనతో టీఆర్ఎస్ వ్యతిరేఖ పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇందులో… కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ కలిసే … మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే…. పొత్తు విషయంలో టీడీపీ సర్దుకుపోయే ధోరణిలో ఉన్నా సీపీఐ, టీజేఎస్ పార్టీలు మాత్రం ఇంకా మంకుపట్టు పడుతూనే ఉన్నాయి. వీటివల్ల ఇప్పటికే అనేక వివాదాలు ఏర్పడ్డాయి.

  • Problems Telangana Mahakutami-Cpi Kodandaram Tdp Tjs

    Problems Telangana Mahakutami

  • మొదట కూటమి చైర్మెన్ పదవి పై కన్నేసిన టిజేఎస్ దాన్ని సాధించుకుంది. సీట్ల సర్దుబాటు విషయంలో ముప్పుతిప్పలు పెడుతోంది. టీజేఎస్ తరహాలోనే సీపీఐ పేచి పెట్టింది. చివరకు పెద్దన్న పాత్రలోకాంగ్రెస్ ఎనిమిది స్థానాలు, టిజేఎస్ కు, సిసిఐకి మూడు స్థానాలు కేటాయిస్తే మొదటి పేచి పెట్టిన ఆ రెండు పార్టీలు చివరకు అంగీకరించాయి. తనకు కేటాయించిన మూడు సీట్లకు సీపీఐ అభ్యర్థులు ప్రకటించింది. టీజేఎస్ మాత్రం కూటమి పక్షాలు ప్రకటించిన స్థానాలను మాకు కావాలంటూ అభ్యర్థులను ప్రకటించి గందరగోళం సృష్టించింది.

  • Problems Telangana Mahakutami-Cpi Kodandaram Tdp Tjs
  • పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ సీటు కాంగ్రెస్ కు దక్కింది. అభ్యర్థిగా ఎర్ర శేఖర్ పేరును ప్రకటించారు. మహబూబ్ నగర్ సీటు తమదే అంటూ టీజేఎస్ తమ అభ్యర్థిగా రాజేంద్ర రెడ్డిని పేరును ప్రకటించింది. ఆసిపాబాద్, ఆత్రం సక్కు, స్టేషన్ ఘన్ పూర్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ తో టీజేఎస్ పోటీ పడుతోంది. టీజేఎస్ తీరుతో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతోంది. టిజేఎస్‌తో నాలుగు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ నాలుగు స్థానాల్లో టీజేఎస్ పోటీ చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టిజేఎస్ ప్రకటన పై ఇప్పటి వరకు భాగస్వామ్య పక్షాల పార్టీలు స్పందించలేదు. కానీ కోదండరాం తీరు పై మండిపడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఒక వేళ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఇంకెన్ని కుమ్ములాటలు ఉంటాయో !