రెండుగా చీలనున్న...“జేఎఫ్సీ”..     2018-02-21   05:30:33  IST  Bhanu C

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీకి సరైన నిర్మాణం కూడా లేకుండా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పశాడు..అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ..ప్రజలలో అప్పుడప్పుడు కనిపించాడు తప్ప పార్టీని మాత్రం ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు..అయితే ఎవరు ఇచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి ఏర్పాటు చేశారు అయితే ఇక్కడి వరకూ ఈ విషయాలు అన్ని అందరికీ తెలిసినవే..

అయితే ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసిన ఈ జేఎఫ్సి ఇప్పడు బద్దలవ్వనుంది అంటున్నారు..ఆ కమిటీలో ఉన్న నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం..ఒకరి మధ్య ఒకరికి విభేదాలు తార‌స్థాయికి చేరిపోయాయి. అసలు విషయం ఏమిటంటే..వెళ్తే ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు విష‌యంలో మిత్ర ప‌క్షాలైన బీజేపీ-టీడీపీల మ‌ధ్య తీవ్ర వివాదాలు.విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో విభజన జరిగి నాలుగేళ్ళు గడించాయి అయితే ఇప్పటికీ కేంద్రం ఏపీ ని పట్టించుకోలేదు అని టిడిపి ఆరోపిస్తోంది…కేంద్రం ఇచ్చిన నిధులని సక్రమంగా ఖర్చు పెట్టకుండా నిధులు దుర్వినియోగం చేశారని బిజెపి ఆరోపిస్తోంది.

అయితే పవన్ ఏర్పాటు చేసిన ఈ “జేఎఫ్‌సీ” లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ సభ్యులు రెండు రోజులపాటు జరిగిన జేఎఫ్‌సీ సమావేశాల్లో పాల్గొన్నారు…ఈ సందర్భంలో…సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయన్న వాదన వినిపిస్తోంది..సమావేశాల మొదటి రోజు ప్రభుత్వం లెక్కలు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని జేపీ అన్నారు అయితే జేపీ అన్న మాటలకి ఉండవల్లి అరుణ్ కుమారు అభ్యంతరం వ్యక్తం చేశారు..అంతేకాదు.. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జేపీ చేసిన వ్యాఖ్యలను మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం కచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేననని జేపీకి కృష్ణారావు కౌంటర్‌ ఇచ్చారు.

ఇదిలాఉంటే ఇప్పుడు ఈ కమిటీలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం తీరుని తప్పుబడుతుంటే మరి కొంతమంది కేంద్రం ని తప్పుబట్టం చేస్తున్నారు..ఈ సావేసలలో మాత్రం ఎవరినికి ఏకాభిప్రాయం రావడం లేదు..అయితే ఇదే విధంగా కనుకా జేఎఫ్‌సీ సమావేశాల తీరు కొనసాగితే..తప్పకుండా జేఎఫ్‌సీ లో చీలికలు రావడం ఖాయం అంటున్నారు.రాజకీయాలకి అతీతంగా ఏర్పడిన జేఎఫ్‌సీ ఆదిసగా చర్చలు జరపాల్సింది పోయి..అందరు వాదనలు చేసుకునే విధంగా ఉండటంతో జేఎఫ్‌సీ లో చీలికలు ఖాయం అంటున్నారు..