జగన్‌ను వెంటాడుతున్న సమస్యలు.. ఆరు నెలల్లో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వా..?

జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు మంచి పాలనను అందిస్తున్నారడంలో అతిశయోక్తి లేదు.అయితే, జగన్ తన తండ్రి వైఎస్సార్ లాగా ప్రజలు గుర్తుంచుకునే పాలనను అందించాలని అనుకున్నారట.

 Problems Haunting Jagan Will There Be More Problems In Six Months Details, Jagan-TeluguStop.com

ఆయన ఆశయం మంచిదే కావచ్చు.కానీ జగన్‌కు అడుగడుగునా అడ్డంకులే మొదలవుతున్నాయి.ఉమ్మడి ఆంధప్రదేశ్ విడిపోయాక ఏపీకి అప్పటికే 70వేల కోట్లకు పైగా అప్పు ఉంది.2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అభివృద్ధి కోసమంటూ మరిన్ని అప్పులు చేశారు.ఏపీలో రాజధాని నిర్మాణానికి కేంద్రం కొన్ని డబ్బులు ఇవ్వగా బాబు మరికొన్ని చేశారు.అవి ఇప్పుడు తడిసి మోపడయ్యాయి.

2019లో జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి ఏమో కానీ అప్పుల సుడిగుండంలో అడుగుపెట్టారు.ఎలా బయటపడతారో అని చాలా మంది నిపుణులు అనేక ప్రశ్నలు సంధించారు.

వారు అన్నట్టే జగన్‌ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.రాష్ట్రం వేరయ్యి ఇప్పటికే ఏడేండ్లు గడిచాయి.

ఇంతవరకు ఏపీకి రాజధాని నిర్మాణం జరగలేదు.చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ సగం నిర్మాణాలు చేపట్టారు.

జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో రెండేళ్లు కాలయాపన చేశారు.మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు ఆందోళన చేపట్టారు.

ఆ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

Telugu Amaravathi, Ap Cm Jagan, Ap Debts, Ap, Chandrababu, Employees, Jagan-Telu

ఇక పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ మొత్తం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే పోతుంది.కేంద్రం నుంచి నిధులు రాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అక్కడే ఆగిపోయింది.ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల పీఆర్సీలు ముందున్నాయి.

ఇప్పటికే రెండు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 1 నుంచి ఆందోళనకు దిగుతామని సీఎస్‌కు నోటీసులు ఇచ్చారు.దీంతో జగన్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదట.

కేంద్రం నిధుల విడుదల జాప్యం చేస్తోంది.పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది.

మరో ఆరు నెలలు ఇలానే కొనసాగితే ఏపీ ముఖ చిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube