బిగ్‌బాస్‌ 2 ఆపేయాలంటూ డిమాండ్‌!!       2018-06-23   01:06:05  IST  Raghu V

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌బాస్‌ను గత సంవత్సరం నుండి సౌత్‌లో కూడా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో ఈ షో మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగు మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ నిర్వహించగా, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 తెలుగు కాస్త డల్‌గా నడుస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది అంటూ తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు మంచి టీఆర్పీ రేటింగ్‌ దక్కుతుందని సంతోషపడుతున్న సమయంలోనే షోను నిలిపేయాలంటూ ఆందోళన ప్రారంభం అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ వారు తమకు అన్యాయం జరుగుతుందని షోను నిలిపేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రూలు ప్రకారం 50 శాతం మందిని ఖచ్చితంగా తమ ఫెడరేషన్‌ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టెక్నీషియన్స్‌ను తమ వారినే వాడాలని, కాని ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం ముంబయి నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు అంటూ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ సంఘ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి సీజన్‌లో కూడా ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ నుండి తక్కువ మందిని తీసుకోవడంతో ఆందోళనలు జరిగాయి. దాంతో అప్పుడు తమ వారికి న్యాయం జరిగేలా 50 శాతం మందిని తీసుకున్నారు. కాని ప్రస్తుతం మళ్లీ మొదటి లాగే అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే తాము షోను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. అదే కనుక జరిగితే మొత్తం గేమ్‌ అంతా కూడా ష్మాష్‌ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

షో నిర్వాహకులు అక్కడి వరకు రానివ్వక పోవచ్చు అని, ఖచ్చితంగా అలా జరగదు అంటూ తమిళ బిగ్‌బాస్‌ నిర్వాహకులు అంటున్నారు. వారి డిమాండ్స్‌ను పరిష్కరించి, వారు అంటున్నట్లుగా 50 శాతం ఖచ్చితంగా వారికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ విషయంకు పూర్తి క్లారిటీ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. మొత్తానికి ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ వారి డిమాండ్స్‌ నెరవేర్చేందుకు బిగ్‌బాస్‌ ఓకే చెప్పాడు. లేదంటే తమిళ బిగ్‌బాస్‌ ఆపేసే అవకాశం ఉంది.