ఆ గ్రామంలో ప్ర‌స‌వించే గ‌ర్భిణీలు ఎన్ని అవస్థలు పడుతున్నారో తెలుసా.? చూస్తే కన్నీళ్లే...!  

”అప్పుడు నాకు 9వ నెల‌. నిండు గ‌ర్భంతో ఉన్నా. ఓ రోజున అనుకోకుండా నాకు పురిటి నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. పొలం ద‌గ్గ‌ర ఉన్న నేను ఇంటికి వ‌చ్చా. నా భ‌ర్త లేడు. అమ్మ ఉంది. కొంత సేపట్లో నా భ‌ర్త వ‌చ్చాడు. పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న న‌న్ను చూసి స‌హాయం కోసం గ్రామంలోకి వెళ్లాడు. అత‌ను తిరిగి వ‌చ్చే సరికి నాకు ప్ర‌స‌వం అయింది. బాలుడికి నేను జ‌న్మనిచ్చా. అయితే బొడ్డు తాడు క‌త్తిరించ‌డానికి అందుబాటులో ఏదీ లేదు. దీంతో అమ్మ ఓ బ్లేడు తీసుకుని బొడ్డు తాడు క‌ట్ చేసింది. దానికి స్వెట‌ర్ దారం చుట్టి ముడివేసింది. అప్ప‌టికి నా భ‌ర్త వ‌చ్చాడు. అయినా ఏం లాభం, నాకు ప్ర‌స‌వం అయిపోయింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ నాకు, నా బిడ్డ‌కు ఏమీ కాలేదు. ఇద్ద‌రం బాగానే ఉన్నాం.”

Problems Faced By Villagers In Mountains Of Uttarakhand-

Problems Faced By Villagers In Mountains Of Uttarakhand

పైన చెప్పింది బ్రెశ్వ‌తి ఓ మ‌హిళ అనుభ‌వించిన ప‌రిస్థితి. ఆమెది ఉత్త‌రాఖండ్‌లోని టోన్స్ వాలీ క‌ల‌ప్ గ్రామం. అది పూర్తిగా కొండ ప్రాంతం. అక్క‌డ ర‌హ‌దారులు లేవు, క‌నీస వ‌స‌తులు లేవు. ఇక హాస్పిట‌ల్స్ అన్న ముచ్చ‌టే లేదు. రోగం వ‌స్తే అక్క‌డికి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డెహ్రాడూన్ లోని హాస్పిటల్‌కు వెళ్లాల్సిందే. దీంతో చాలా మంది గ‌ర్భిణీలు మృత్యువాత ప‌డుతున్నారు. వారికి క‌నీస స‌దుపాయాలు అస్స‌లే లేవు. క‌నీసం మంత్ర‌సాని లాంటి వారి స‌దుపాయం కూడా వారికి లేదు.

అలా క‌ల‌ప్ గ్రామంలో చాలా మంది గ‌ర్భిణీలు ఇప్ప‌టికి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తూ చ‌నిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఈ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అస‌లు వీరివైపు క‌న్నెత్తి చూసిన నాయ‌కుడు లేడు. ఎప్ప‌టినుంచో ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఇక‌నైనా త‌మ జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని వారు ఎదురు చూస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికైనా స్పందిస్తాయో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!