భార్యతో తరచూ గొడవలు పడుతున్న టాలీవుడ్ హీరో.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో సమంత చైతన్య విడిపోవడం గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.కారణాలు తెలియకపోయినా క్యూట్ కపుల్ గా పేరును సొంతం చేసుకున్న సమంత చైతన్య విడాకుల ప్రకటన చాలామందిని బాధ పెట్టింది.

 Problems Between One More Tollywood Industry Couple Goes Viral , Career Troubles-TeluguStop.com

అయితే మరో జంట మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయని సమాచారం.ఒక చిన్న హీరోకు, అతని భార్యకు మధ్య తరచూ ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

టాలీవుడ్ హీరో పలు సినిమాల్లో నటించినా ఇప్పటికీ సరైన గుర్తింపు లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.అయితే అతని భార్య మాత్రం పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడం గమనార్హం.

భార్యతో గొడవలు పడుతూ ఉండటంతో ఆ హీరో నటిస్తున్న సినిమాల షూటింగ్ లు కూడా నత్తనడకన జరుగుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న ఆ హీరో కొత్త సినిమాలను కూడా ప్రకటించడం లేదు.

ఈ టాలీవుడ్ హీరో ఈ మధ్య కాలంలో మీడియాకు కూడా దూరంగా ఉండటం గమనార్హం.చిన్నచిన్న విషయాలకే ఈ జంట గొడవలు జరుగుతుండగా గొడవ ఎవరివైపు నుంచి మొదలైందనే ప్రశ్నకు సమాధానం తెలియల్సి ఉంది.

మారుతున్న కాలం వల్ల సర్దుకొని జీవనం సాగించే జంటల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.చైసామ్ విడాకులకు ముందు ఇండస్ట్రీకి చెందిన కొన్ని జంటలు కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే ఇద్దరూ కలిసి చర్చించుకుని సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటే మంచిది.సమస్య పెద్దదైతే కుటుంబ సభ్యులతో చర్చించి ఆ సమస్యకు సొల్యూషన్ కనుక్కుంటే మంచిది.

గొడవల వల్ల ఆయా హీరోల హీరోయిన్లు కెరీర్ విషయంలో కూడా సరైన నిర్ణయాలను తీసుకోలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube