పనిలో ఇబ్బందులు వస్తున్నాయా... దోష నివారణకు నెమలి ఈకలతో ఇలా చేయండి!

Problems At Work Do This With Peacock Feathers To Prevent Bad Luck, Problems, Peacock Feathers, Bad Luck, Puja, Worship, Hindu Belives

కుటుంబంలో తరచూ అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.ఆ సమస్యలను అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లభించక ఏమి చేయాలో పాలుపోక చాలామంది తీవ్ర మనస్థాపానికి గురవుతుంటారు.

 Problems At Work Do This With Peacock Feathers To Prevent Bad Luck, Problems, Pe-TeluguStop.com

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కోవటానికి చాలామంది అనేక రకాల పూజలు, వాస్తు దోషాలు చేయిస్తూ ఉంటారు.ఎన్ని ప్రయత్నాలు చేసిన సమస్యలు పరిష్కారం అవటం లేదా? ఐతే ఈ నెమలి ఈకలతో పరిష్కారం లభిస్తుంది.

మన భారతదేశంలో నెమలికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.నెమలిని మన జాతీయ పక్షికి చిహ్నంగా భావిస్తారు.పురాతన కాలం నుండి నెమలి ఈకలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.నెమలి ఈకలను ఇంటిలో ఉంచుకోవటం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ఈ నెమలి ఈకల వల్ల వాటికి పరిష్కారం లభిస్తుంది.

దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు బెడ్ రూమ్ లో తూర్పు లేదా ఉత్తరం వైపున ఉన్న గోడకు రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయే వారి సంసారం అన్యోన్యంగా సాగుతుంది.జాతక దోషాలు ఉన్న వారు బెడ్ రూమ్ లోని పశ్చిమ దిశలో ఉన్న గోడపై నెమలి ఈకలను ఉంచడం వల్ల వారి జీవితంలో ఎదురయ్యే అనేక రకాల జాతక దోషాలు తొలగిపోయి ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇంటిలోని ఆగ్నేయ మూలలో నెమలి ఈకను ఉంచటం వల్ల వారి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.ఏమి పని మొదలు పెట్టిన వాటికి ఆటంకాలు కలిగి నష్టం కలుగుతుంటే ఇంటి పూజా స్థలంలో ఐదు నెమలి ఈకలను ఉంచి ప్రతిరోజూ పూజించి, 21వ రోజున ఈ నెమలి ఈకలను అల్మారాలో ఉంచుకోవాలి.ఇలా చేయటం వల్ల పనిలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి.

Video : Problems At Work Do This With Peacock Feathers To Prevent Bad Luck, Problems, Peacock Feathers, Bad Luck, Puja, Worship, Hindu Belives

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube