గురుకుల విద్యార్దిని మరణంపై విచారణ జరపాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా:ఇమాంపేట గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి( Vaishnavi ) అనే విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మడిమాండ్ చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో గురుకుల కళాశాల విద్యార్ది( Gurukula student )ని మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ( SFI ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థిని చావుకు కారణమైన వాస్తవాలను బయటికి తీయాలని,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ జిల్లా నాయకులు జయంతి,నందిని,అఖిల, వినయ్,సైదా,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ అలర్ట్ : అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త సుమీ..

Latest Suryapet News