కబడ్డీ అభిమానులకు శుభవార్త... అక్టోబర్‌ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ వివరాలివే!

కబడ్డీ అభిమానులకు శుభవార్త… PKL (ప్రో కబడ్డీ లీగ్‌) సీజన్‌ – 9 బెంగళూరులో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుందనే విషయం తెలిసినదే కదా.ఈ సందర్భంగా గ్రీన్‌కో గ్రూప్‌ కో–ఫౌండర్‌, చైర్మన్‌ శ్రీనివాస్‌ శ్రీరామనేని, NED గ్రూప్‌కు చెందిన మహేష్‌ కొల్లి, గౌతమ్‌ రెడ్డి తెలుగు టైటాన్స్‌ సీజన్‌ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు.తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని మాట్లాడుతూ.”గత సీజన్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్‌ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం.” అని పేర్కొన్నారు.

 Pro Kabaddi League Season 9 Starts From October 7 Details, Good News, October 7,-TeluguStop.com

ఇక తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని నేదురుమల్లి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్‌ 9 వివో ప్రో కబడ్డీ లీగ్‌ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం.

మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాం.ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.వెంకటేష్‌ గౌడ్‌, మన్జీత్‌ల కాంబినేషన్‌ టీమ్‌కు కప్‌ను తేగలదని విశ్వసిస్తున్నాం.ఈ సంవత్సరం కప్‌ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్‌ పోటీపడుతుంది’’ అని చెప్పారు.

 Pro Kabaddi League Season 9 Starts From October 7 Details, Good News, October 7,-TeluguStop.com

తెలుగు టైటాన్స్‌ కోచ్‌ వెంకటేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘‘పర్వేష్‌ భైంశ్వాల్‌, విశాల్‌ భరద్వాజ్‌, సూర్జీత్‌ సింగ్‌, రవీందర్‌ పహల్‌ టీమ్‌లో ఉన్నారు.వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు.ఇక మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9లో తెలుగు టైటాన్స్‌ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న బెంగళూరు బుల్స్‌తో ఆడనుంది.

Video : Pro Kabaddi League Season 9 Starts From October 7 Details, Good News, October 7, .news, Sports Update , Pro Kabaddi League , Pro Kabaddi League Season 9, Telugu Titans, Kabaddi, Pkl #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube