ప్రొ కబడ్డీ లీగ్ లో ఈ ఆటగాళ్ళ రేటెంతో తెలుసా?  

 • మన దేశంలో ఐపీఎల్ తరువాత ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి ఈ లీగ్ 6వ సీజన్ టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 7, 2018వ తేదీన ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 6వ సీజన్ జనవరి 6, 2019వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఈ లీగ్‌కు గాను ఈ ఏడాది మేలో వేలం పాట నిర్వహించారు. ఇందులో భారీ మొత్తాలకు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా!

 • Pro Kabaddi League 2018 Top 10 Highest Earners From PKL Auctions-Highest Nitin Tomar Pkl Auctions Pro Rahul Chaudhari

  Pro Kabaddi League 2018 Top 10 Highest Earners From PKL Auctions

 • ప్రొ కబడ్డీ లీగ్ 2018కు నిర్వహించిన వేలం పాటలో మను గోయత్ అత్యధికంగా రూ.1.51 కోట్ల ధర పలికాడు. ఇతన్ని హర్యానా స్టీలర్స్ కైవసం చేసుకుంది. అలాగే ఇతర ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 • Pro Kabaddi League 2018 Top 10 Highest Earners From PKL Auctions-Highest Nitin Tomar Pkl Auctions Pro Rahul Chaudhari
 • * రాహుల్ చౌదరిని రూ.1.29 కోట్లకు తెలుగు టైటాన్స్ దక్కించుకుంది.
  * దీపక్ హుడా రూ.1.15 కోట్ల ధర పలికాడు. ఇతన్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ సొంతం చేసుకుంది.
  * నితిన్ తోమర్ రూ.1.15 కోట్లకు పూనెరి పాల్టన్‌కు అమ్ముడయ్యాడు.
  * రిశ్వంక్ దేవదిగ రూ.1.11 కోట్లకు యూపీ యోధాకు అమ్ముడయ్యాడు.
  * ఫజెల్ అట్రాచలి రూ.1 కోటికి యు ముంబా టీంకు అమ్ముడయ్యాడు.
  * ప్రశాంత్ కుమార్ రాయ్‌ని రూ.79 లక్షలకు యూపీ యోధా టీం దక్కించుకుంది.
  * అబోజర్ మిఘనిని రూ.76 లక్షలకు తెలుగు టైటాన్స్ కైవసం చేసుకుంది.
  * సురేందర్ నడాను రూ.75 లక్షలకు హర్యానా స్టీలర్స్ దక్కించుకుంది.
  * సందీప్ ధుల్‌ను రూ.66 లక్షలకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొనుగోలు చేసింది.

 • Pro Kabaddi League 2018 Top 10 Highest Earners From PKL Auctions-Highest Nitin Tomar Pkl Auctions Pro Rahul Chaudhari
 • వీరే కాకుండా చంద్రన్ రంజిత్ (రూ.61.25 లక్షలు, దబాంగ్ ఢిల్లీ), దీపల్ నర్వాల్ (రూ.57 లక్షలు, పాట్నా పైరేట్స్), పవన్ కుమార్ (రూ.52.8 లక్షలు, బెంగళూరు బుల్స్), వికాస్ ఖండోలా (రూ.47 లక్షలు, హర్యానా స్టీలర్స్), ధర్మరాజ్ కెరాలతన్ (రూ.46 లక్షలు, యు ముంబా)లు కూడా టాప్ 10 తరువాతి స్థానాల్లో నిలిచారు.