ప్రొ క‌బ‌డ్డీ లీగ్ 2018 వేలంలో 12 ఫ్రాంచైజీలు ప్లేయ‌ర్ల కొనుగోలుకు పెట్టిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..?  

 • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లాగే ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (పీకేఎల్‌)కు కూడా క్ర‌మంగా ఆద‌రణ పెరుగుతోంది. ఈ ఏడాది ఈ లీగ్‌కు జ‌రిగిన వేలం పాట‌లో కొంత మంది ప్లేయ‌ర్లు రూ.1 కోటికి పైగా ధ‌ర ప‌లికారు. పీకేఎల్ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం తొలిసారి కాగా, ఈ వేలంలో 5 ఇండియ‌న్ ప్లేయ‌ర్లు, 1 ఇరాన్ ప్లేయ‌ర్‌ను టీంలు రూ.1కోటికి పైగా వెచ్చించి కొనుగోలు చేశాయి. ఈ ఏడాది ముంబైలో మే 30, 31వ తేదీల్లో రెండు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పీకేఎల్ ప్లేయ‌ర్ల వేలం జ‌ర‌గ్గా అందులో పాల్గొన్న 12 జ‌ట్ల ప్రాంచైజీలు 181 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ ప్లేయ‌ర్ల కోసం రూ.4 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించ‌గా, మొత్తం 12 ఫ్రాంచైజీల బ‌డ్జెట్ రూ.48 కోట్ల‌కు చేరుకుంది. అయితే ఫ్రాంచైజీలు అన్ని క‌లిపి ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం రూ.45.93 కోట్లు.

 • Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players-Patna Pirates Pro Telugu Titans

  Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players

 • పీకేఎల్ 2018 వేలంలో ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు చేసిన ఖ‌ర్చుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 • 1. బెంగాల్ వారియ‌ర్స్‌
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,79,62,627
  మిగిలింది: రూ. 20,37,373

 • 2. బెంగ‌ళూరు బుల్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ. 3,60,80,000
  మిగిలింది: రూ. 39,20,000

 • Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players-Patna Pirates Pro Telugu Titans
 • 3. దబాంగ్ ఢిల్లీ కేసీ
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,83,70,588
  మిగిలింది: రూ. 16,29,412

 • 4. గుజ‌రాత్ ఫార్చూన్ జియాంట్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,73,74,354
  మిగిలింది: రూ. 26,25,646

 • 5. హ‌ర్యానా స్టీల‌ర్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,86,14,916 మిగిలింది: రూ. 13,85,084

 • Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players-Patna Pirates Pro Telugu Titans
 • 6. జైపూర్ పింక్ ప్యాంథ‌ర్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,84,00,000
  మిగిలింది: రూ. 16,00,000

 • 7. పాట్నా పైరేట్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,80,00,320
  మిగిలింది: రూ. 19,99,680

 • 8. పుణెరి ప‌ల్టాన్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,86,44,658
  మిగిలింది: రూ. 13,55,342

 • Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players-Patna Pirates Pro Telugu Titans
 • 9. త‌మిళ్ త‌లైవాస్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,73,23,000
  మిగిలింది: రూ. 26,77,000

 • 10. తెలుగు టైటాన్స్
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,98,53,588
  మిగిలింది: రూ. 1,46,412

 • 11. యూపీ యోధా
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,92,00,000
  మిగిలింది: రూ. 8,00,000

 • 12. యు ముంబా
  ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,95,30,000
  మిగిలింది: రూ. 4,70,000