బ్రిటన్: లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా కైర్ స్టార్మర్

బ్రిటన్‌ లేబర్ పార్టీ కొత్త నేతగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు.ఈ పదవి కోసం భారత సంతతికి చెందిన లిసా నంది, రెబెకా లాంగ్ బెయిలీలు పోటి పడ్డారు.

 Pro-european Centrist Keir Starmer, Uk Labour Leader, Coronavirus, Boris Johnson-TeluguStop.com

అయితే పార్టీలోని ఆయన మద్ధతుదారులు, ఇతర సభ్యులు ఓటింగ్‌లో స్టార్మర్‌ను గెలిపించారు.వృత్తి రీత్యా న్యాయవాది అయిన స్టార్మర్‌ 2015లో తొలిసారి ఎంపీగా గెలుపొందారు.

లేబర్ పార్టీ లీడర్ ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓటింగ్‌లో 50 శాతం బ్యాలెట్లను ఆయన పొందారు.పార్టీ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత సర్ కైర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మాట్లాడారు.

ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వచ్చే వారం ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు.ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని, సమయం వచ్చినప్పుడు అధికారం అందుకుని దేశానికి సేవల చేయగలనని స్టార్మర్ తన వీడియో సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవలి సంవత్సరాలలో యూదు వ్యతిరేకి అన్న ముద్ర నేపథ్యంలో స్టార్మర్ క్షమాపణలు చెప్పారు.రానున్న రోజుల్లో దీనిని మూలల నుంచి పెకిలించి వేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు.

Telugu Boris Johnson, Coronavirus, Proeuropean, Uk-

లేబర్ పార్టీ లీడర్‌షిప్ కోసం జరిగిన ఎన్నికల్లో స్టార్మర్‌కు 2,75,780 (56.2శాతం) ఓట్లు, రెబెకా లాంగ్ బెయిలీకి 1,35,218 (27.6 శాతం), లీసా నందికి 79,597 (16.2 శాతం) ఓట్లు పడ్డాయి.లేబర్‌పార్టీ సెలక్టోరేట్‌లోని ప్రతి విభాగంలో సర్ కీర్ మెజారిటీని సాధించారు.ఓటు హక్కును వినియోగించుకునేందుకు 13,000 మంది రిజస్టర్డ్ మద్ధతుదారులు 25 పౌండ్ల రుసుము చెల్లించారు.గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ ఓటమి తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జేరిమి కార్బన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.స్టార్మర్ విజయంపై స్పందించిన కార్బన్ ఆయన లేబర్ పార్టీపై విశ్వాసం పెంపొందించి కొత్త శకానికి నాయకత్వం వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube