ప్రియురాలిని రేప్ చేస్తుంటే..ప్రియుడు ఏమి చేశాడో తెలిస్తే షాకే  

Priyuralini Rape Chestunte Priyudu Emi Chesado Telusa -

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిన ఎవరైనా ఎడిపిస్తేనే ప్రియుడు తట్టుకోలేదు.ఎలాంటి వాళ్ళు అయినా సరే గొడవకి దిగి నానా రచ్చ చేస్తాడు.

అలాంటిది ఓ యువతిని తన ప్రియుడు ముందే బలవంతం చేయబోతే ఆ ప్రియుడు పారిపోయిన సంఘటన ఆ యువతిని షాక్ కి గురిచేసింది.ఛి ఛి ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ సమాజం ముక్కు మీద వేలు వేసుకుంది.

ప్రియురాలిని రేప్ చేస్తుంటే..ప్రియుడు ఏమి చేశాడో తెలిస్తే షాకే-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే నిజంగా ఈ సంఘటన జరిగింది.అది ఎక్కడో కాదు గుంటూరు జిల్లాలోనే.

వివరాలలోకి వెళ్తే.ఈ మధ్య గుంటూరు జిల్లా పేరు చెప్తే అత్యాచారాల లిస్టు బయటకి వస్తోంది.

గత కొన్ని నెలల కాలంలో లెక్కకి మించిన అత్యాచారాలు గుంటూరు లో జరుగుతూ వచ్చాయి.అయినా రక్షణ చర్యలు ఏ మాత్రం కనపడటం లేదు.

జిల్లాలో నిన్న జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో దర్యాప్తు జరిపిన పోలీసులకు వివరాలు తెలుసుకుని ఆశ్చర్య పోయారు.అసలు ఏమి జరిగింది అంటే.

గుంటూరు హాస్పటల్ లో నర్స్‌గా పనిచేస్తోన్న ఓ యువతి శుక్రవారం డ్యూటీ ముగించుకుని రాత్రి పదిగంటల సమయంలో మంగళగిరి సమీపంలోని కోకోకోలా కంపెనీ సమీపానికి తన ప్రియుడితో కలిసి వెళ్లింది…ఈ మార్గ మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అనుసరిస్తూ వచ్చి ప్రియుడిని తోసేసి ఆమెని దగ్గరలోని పోలాలోకి లాక్కెళ్ళారు.ఆ పై అత్యాచారం చేసి ఆమెకి నరకం చూపించారు.

అయితే వారు కొట్టిన దెబ్బలకి మళ్ళీ లేచి అక్కడి నుంచీ పారిపోయాడు ఆ ప్రభుద్దుడు.అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కనీసం పోలీసులకి కూడా తెలియచేయలేదు సరికదా స్థానికులకి కూడా చెప్పకుండా పారిపోయాడు.

రాత్రంతా నరకం అనుభవించి అక్కడే పడి ఉన్న ఆమెని గ్రామస్తులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు.కేసుని నందు చేసుకున్న పోలీసులు ప్రియుడు తో పాటు ఆ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు