ప్రియుడి దారుణ హత్య....చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు       2018-07-03   04:25:37  IST  Raghu V

ప్రియుడిని పక్కా ప్లాన్ వేసి మరీ చంపేసినది ప్రేయసి తన ఇంటికి రావద్దు అంటే వచ్చాడని మరీ వెంటాడి చంపిన ఈ ప్రేయసి ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా చేస్తోంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా దేశాయిపేట పంచాయితీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన పింజల బాలచంద్రశేఖర్‌రావుకు 13 ఏళ్ల నుంచీ కరీమూన్ అనే ఆమెతో వివాహేతర సంభంధం ఉంది.

అయితే జూన్ 26 న తన ఇంటివద్ద తండ్రికి సంభందించిన కార్యక్రమం ఉండటంతో చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అతడు శాంతినగర్ లో తన తమ్ముడి ఇంటికి వచ్చాడు..అయితే అదే రోజు రాత్రి ప్రియురాలిని కలిశాడు…మరునాడు ఉదయమే చంద్రశేఖర్ వద్దకు వచ్చిన ప్రియురాలు తన ఇంటికి రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ వస్తే చంపేస్తానని తెగేసి చెప్పింది..దీంతో చంద్రశేఖర్‌రావు షాక్ కు గురయ్యాడు.

వివాహేతర సంబంధం వద్దని ఆమె వారిస్తున్నా సరే చంద్రశేఖర్ వినలేదు. తన సోదరుడు చంద్రశేఖర్ కు నచ్చచెప్పినా సరే అతడు వినలేదు…అయితే చంద్రశేఖర్‌ తన ఇంటికి వస్తే చంపాలని ప్రియురాలు ప్లాన్ చేసుకొంది అందుకోసం తన సోదరుడిని కూడా పిలిపించి ఉంచింది.ఎప్పటిలాగే ఆమె ఇంటికి చంద్రశేఖర్‌రావు వెళ్ళగానే ప్రియురాలు రాడ్‌తో గట్టిగా కొట్టింది. ..అయితే తప్పించుకుని పారిపోతున్న అతడిని వెంబడించి మరీ అత్యంత దారుణంగాఅ హత్య చేశారు..అయితే నిందితులని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.