ప్రియాంక గాంధీ చీర కట్టు ఫోటో  

Priyanka Gandhi Shares Throwback Photo Of Her Wedding Day Joining -

దివంగత ఇందిరా గాంధీ మనవరాలు,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ చీర కట్టు ఫోటో ను ఒకటి షేర్ చేసింది.ఎప్పుడో 22 ఏళ్ల క్రితం నాటి తన పెళ్లి రోజు నాటి ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయిపోయింది.

Priyanka Gandhi Shares Throwback Photo Of Her Wedding Day Joining

#saree twitter అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించి మరీ ఆ ఫోటోను ట్వీట్ చేసింది.నా పెళ్లి రోజు నాటి ఉదయం పూజా సమయంలో దిగిన ఫోటో అంటూ ప్రియాంక తన చీర కట్టు ఫోటో ను షేర్ చేసింది.

దీనితో ఇలా ఫోటో షేర్ అయ్యిందో లేదో కొన్ని క్షణాల్లోనే ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయిపొయింది.అంతేకాకుండా ఈ ఫోటో కు ఎన్ని లైక్ లు వచ్చాయో తెలుసా 14 లక్షల మంది లైక్ చేయగా,సుమారు 1.6 లక్షల మంది రీట్వీట్ చేయడం విశేషం.ప్రియాంక గాంధీ 1997,ఫిబ్రవరి 18 న ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రియాంక గాంధీ చీర కట్టు ఫోటో-General-Telugu-Telugu Tollywood Photo Image

గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్‌లో #SareeTwitter అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇలా ప్రముఖులు,మహిళా రాజకీయ నాయకులూ,సెలబ్రిటీలు చీరల్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంకా గాంధీ తన చీర ఫోటోను షేర్ చేయడం తో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు