గ్యాప్ లేకుండా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన హీరో భార్య

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.కేవలం కన్నడ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగునాట కూడా ఉపేంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Priyanka Upendra Signed Back To Back Movies, Sandalwood, Hero Upendra, Tollywood-TeluguStop.com

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చివరగా తెలుగులో ఉపేంద్ర కనిపించాడు.ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో కూడా ఈ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే కబ్జా అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఉపేంద్ర భార్య పేరు ప్రియాంకా.

ఈమె కూడా కోలీవుడ్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్.తెలుగులో కూడా ఆమె ఉపేంద్రతో రా, జేడీ చక్రవర్తితో సూరి అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ప్రియాంకాని ఉపేంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తుంది.

లాక్ డౌన్ తర్వాత మరల ఆమె ఉగ్రావతార సినిమా షూటింగ్ మొదలు పెట్టింది.మరోవైపు కొత్త సినిమాలను అంగీకరిస్తున్నారు.తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే మూవీకి ప్రియాంక ఒకే చెప్పింది.1980 అనే థ్రిల్లర్ మూవీలో నటించేందుకు ప్రియాంక అంగీకరించింది.ఈ కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను ఒప్పుకున్నానని ప్రియాంక తెలిపింది.దసరా రోజు అధికారికంగా ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రకటించింది.పెళ్లి తరువాత చాలా మంది హీరోయిన్స్ కెరియర్ కి ముగింపు చెప్పేస్తే ఉపేంద్ర సహకారంతో ఆమె ఇప్పటికి హీరోయిన్ గా లేడీ ఒరియాంటెడ్ సినిమాలతో ప్రేక్షకులకి వినోదం అందిస్తూనే ఉంది.ఈమె ఎక్కువగా హర్రర్, థ్రిల్లర్ జోనర్ లోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube