మార్చి పరీక్షలనే నమ్ముకున్న హీరోయిన్

నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్‌లీడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో టాలీవుడ్‌కు ప్రియాంక ఆరుల్ మోహన్ అనే హీరోయిన్ పరిచయమైంది.

 Priyanka Mohan Career Depends On March Result, Priyanka Arul Mohan, Sreekaram, S-TeluguStop.com

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు.కానీ ఆ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా ప్రియాంక కనిపించలేదు.

దీంతో ఈ బ్యూటీ ఇక తెరమరుగు అయ్యిందని అందరూ అనుకున్నారు.

కానీ ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రియాంక రెడీ అయ్యింది.

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’లో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్ సరసన డాక్టర్ అనే సినిమాలో ప్రియాంక నటిస్తోంది.ఈ సినిమాను కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

దీంతో ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు ఈ రెండు చిత్రాల రిజల్ట్‌పై ఆధారపడి ఉందని, ఈ సినిమాలు హిట్ అయితేనే అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తాయిన సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే మార్చిలోనే ఈ రెండు సినిమాలు వస్తుండటంతో ఒకే నెలలో అమ్మడు తన కెరీర్ కోసం పరీక్ష రాస్తున్నట్లు, ఆమె మార్చి పరీక్షలు పాస్ అయితేనే అమ్మడికి ఛాన్సులు వస్తాయనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఇక శ్రీకారం చిత్రంతో శర్వానంద్ కూడా అదిరిపోయే హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.ఈ సినిమాలోని ‘భలేగుంది బాలా’ అనే పాట ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

మరి ప్రియాంక ఆరుల్ మోహన్ మార్చి పరీక్షలు పాస్ అవుతుందో లేదో తెలియాలంటే మరొక నెల ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube