టాక్సీవాలా హీరోయిన్ కి చివరికి ఆ చిన్న హీరో దిక్కయ్యాడు  

Taxiwala Heroine Priyanka Second Heroine Started - Telugu Hero Kiran Abbavaram, Second Heroine Started, Taxiwala Heroine Priyanka, Telugu Heroins, Tollywood

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి ప్రియాంకా జువాల్కర్.మొదటి సినిమాతోనే నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు హాట్, రొమాన్స్ కి కూడా ఒకే అనే విధంగా విజయ్ దేవరకొండ తో రెచ్చిపోయిన ఈ బ్యూటీకి ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరిగిపోతాయని అందరూ భావించారు.

Taxiwala Heroine Priyanka Second Heroine Started - Telugu Hero Kiran Abbavaram, Second Heroine Started, Taxiwala Heroine Priyanka, Telugu Heroins, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

అనుకున్నట్లుగానే రవితేజ డిస్కో రాజా సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.ఆమె ప్లేస్ లో నభా నటేష్ వచ్చి చేరింది.

అయితే తరువాత చాలా ప్రయత్నాలు చేస్తున్న పెద్ద హీరోలు ఎవరు కూడా ఈ భామని పట్టించుకోవడం లేదు.

ఇక దర్శకులు అయితే ప్రియాంకా జువాల్కర్ ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయారు.

టాక్సీవాలా సినిమా తర్వాత మీడియాలో కూడా పెద్దగా ఆమె పేరు వినిపించలేదు.అయితే ఊహించని విధంగా తాజాగా ఆమె మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా తాజాగా ఓపెనింగ్స్ జరుపుకుంది.రాజా వారు రాణిగారు అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంకా జువాల్కర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ ఓపెనింగ్స్ లో ప్రియాంకాని చూసినవారు పెద్ద హీరో సినిమాతో వస్తుందని అనుకుంటే ఇలా చిన్న హీరోకి పరిమితం అయిపోయిందే అని బాధపడుతున్నారు.టాలీవుడ్ లో తెలుగమ్మాయిల మీద ఉన్న చిన్న చూపు మరోసారి ప్రియాంకా జువాల్కర్ విషయం లో బయట పడింది అంటూ చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు