బాలయ్యతో ఛాన్స్.. అమ్మడి ఫేట్ మారుతుందా..!

నందమూరి బాలకృష్ణ సినిమాలో ఒక అన్ లక్కీ హీరోయిన్ ఛాన్స్ అందుకుందని టాక్.ప్రస్తుతం వీర సింహా రెడ్డి మూవీ చేస్తున్న బాలకృష్ణ ఈ మూవీ తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 Priyanka Jawalkar In Balakrishna Movie ,  Balakrishna Movie , Priyanka Jawalkar,-TeluguStop.com

ఆ మూవీలో ఒక హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని అడిగినట్టు టాక్.అయితే అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెని వద్దని అనుకున్నారట.

ఇక మరోపక్క ఈ మూవీలో బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని తెలిసిందే.ఆమెతో పాటు మరో హీరోయిన్ ప్రియాంక జవల్కర్ కూడా బాలకృష్ణ 108వ సినిమాలో ఉంటుందని టాక్.

బాలకృష్ణ ఛాన్స్ అందుకుంది అంటే ప్రియాంకా ఫేట్ మారిపోయినట్టే.విజయ్ దేవరకొండతో ట్యాక్సీ వాలా మూవీతో హిట్ అందుకున్న అమ్మడు ఎస్.ఆర్ కళ్యాణమండపం మూవీ లో కూడా నటించింది.అందం అభినయం ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు.

అందుకే ఆమె కెరీర్ పరంగా వెనకపడి ఉంది.బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అంటే ఆమెకు కెరీర్ కి కలిసి వచ్చే అంశమే మరి ప్రియాంకా ఈ సినిమాతో అయినా పుంజుకుంటుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube