బ్రహ్మాజీ కామెడీకి ఫ్యాన్ అయిపోయిన హీరోయిన్

హీరోగా కెరియర్ ప్రారంభించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకొని ప్రస్తుతం కమెడియన్ గా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్న నటుడు బ్రహ్మాజీ.ప్రస్తుతం ఉన్న సీనియర్ యాక్టర్స్ లో బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ భాగా క్లిక్ అవుతుంది.

 Heroine Priyanka Jawalkar Fan Of Brahmaji Comedy, Ek Mini Katha Movie, Tollywood-TeluguStop.com

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా నుంచి అతనిలో ఉన్న వేరియేషన్స్ ని దర్శకులు పెర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని కమెడియన్స్ గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తున్నారు.తాజాగా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఎక్ మినీ కథ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించాడు.

అమెజాన్ ప్రైమ్ లో అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.యూత్ నుంచి మంచి స్పందన వస్తుంది.

తెలుగులో ఇలాంటి కంటెంట్ తో ఇప్పటి వరకు సినిమాలు రాకపోవడం, అది కూడా కథాంశంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా పెర్ఫెక్ట్ కామెడీతో ప్రెజెంట్ చేయడంతో ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతుంది.ఇదిలా ఉంటే తెలుగు యంగ్ హీరోయిన్ ప్రియాంకా జువాల్కర్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఎక్ మినీ కథ సినిమా చూస్తున్నట్లు ఫోటో పెట్టింది.

ఇక అది కూడా బ్రహ్మాజీ కామెడీ కోసమే ఈ మూవీని ప్రత్యేకంగా చూస్తున్నా అని పోస్ట్ లో పేర్కొంది.బ్రహ్మాజీతో కలిసి తిమ్మరుసు మూవీలో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.

అక్కడ అతని కామెడీ టైమింగ్ కి ప్రియాంకా భాగా కనెక్ట్ అయ్యిందని టాక్.ఈ నేపధ్యంలో ఆ సమయంలోనే బ్రహ్మాజీ, సత్యదేవ్ తను కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసేది.

ఇప్పుడు అలా అతని టైమింగ్ కి కనెక్ట్ అవ్వడంతో ఎక్ మినీ కథలో బ్రహ్మాజీ కామెడీని ఎంజాయ్ చేస్తూ చూసింది.ఇక ప్రియాంక పోస్ట్ పై బ్రహ్మాజీ కూడా రెస్పాండ్ అయ్యి థాంక్స్ చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube