ప్రధానిపై పోటీకి సై అంటున్న ప్రియాంకా గాంధీ  

ప్రధాని మోదీపైనే పోటీకి సిద్ధం అవుతున్న ప్రియాంకా గాంధీ. .

Priyanka Gandhi Ready To Contest On Pm Modi-

దేశ రాజకీయాలలో ఊహించని సంచలనం జరగనుందా అంటే అవుననే మాట ఇప్పుడు రాజకీయాలలో వినిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న నెహ్రు ఫ్యామిలీలోకి రాహుల్ గాంధీతో పాటు భవిష్యత్తు వారసురాలిగా, నాయనమ్మ ఇందిరా పోలికలతో ఉన్న ప్రియాంకా గాంధీ కూడా ఎంట్రీ ఇచ్చేసారు.ఆమె రాజకీయాలకి దూరంగా ఉంటారని అందరూ భావించిన తాజాగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు చేపట్టడం ద్వారా అన్నని ప్రధాని చేయాలనే లక్ష్యం పెట్టుకుంది..

Priyanka Gandhi Ready To Contest On Pm Modi--Priyanka Gandhi Ready To Contest On PM Modi-

ఇక రాజకీయాలలోకి వచ్చిన వెంటనే తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రియాంకా ఉత్తరప్రదేశ్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రధాని మోడీకి చెమటలు పట్టిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీపైనే పోటీకి సై అంటుంది.మోడీ యూపీలో వారణాసి నుంచి లోక్ సభ బరిలో నిలబడుతున్నారు.

ఇప్పుడు అతనిపైన ప్రియాంకా గాంధీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.అదే జరిగితే ప్రదానిపైనే పోటీకి దిగిన నెహ్రు కుటుంబంగా ప్రియాంకా చరిత్రలో నిలిచిపోతుంది.మరి ఇది ఎంత వరకు వాస్తవరూపం దాల్చుతుందో చూడాలి.