కేంద్రంపై మండిపడ్డ ప్రియాంకా.. కరోనా బాధితులపై పన్నువసూలా..?

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు.నేడు జరుగ్నున్న జి.

 Priyanka Gandhi Fires On Central Government , Central Government, Corona, Covid-TeluguStop.com

ఎస్.టి సమావేశం నేపథ్యంలో కరోనా ఔషధాలు, వస్తు సేవ్లపై పన్ను తొలగించాలని ప్రియాంకా డిమాండ్ చేశారు.కరోనా బాధితుల మీద జాలి చూపకుండా కేంద్రం వ్యవహైస్తుందని.కరోనా వేళ దాన్ని కట్టడికి వాడే ఔషధాలు, వస్తువుల మీద జి.ఎస్.టి ఉండటం సబబు కాదని ఆమె అన్నారు.

శానిటైజర్లు, కాటన్ మాస్క్, పీపీఈ కిట్స్, వ్యాక్సిన్, వెంటిలేటర్స్, కృత్రిం శ్వాస పరికరాలు, రెమ్ డెసివిర్ ల పై జి.ఎస్.టి విధిస్తున్నారని.కరోనా వల్ల నానా కష్టాలు పడుతున్న ప్రజల నుండి పన్నులు వసూలు చెయడం క్రూరమైన పని అని ఆమె అన్నారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 43వ జి.ఎస్.టి సమావేశం జరుగనుంది.కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి.

అయితే ఇదివరకే కరోనా ఔషధాలు , వ్యాక్సిన్ల మీద జి.ఎస్.టి పై నిర్మలా సీతారామన్ స్పందించారు.రేట్లు అధుపులో ఉండేదుకే వాటికి జి.ఎస్.టి యాడ్ చేశామని లేదంటే ఔషధ కంపెనీలు ఇష్టమొచ్చిన రేట్లను వాటిని అందిస్తారని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube