చెత్త బస్సులు అంటూ సొంత పార్టీ పైనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీకి సొంత పార్టీ ఎమ్మెల్యే గట్టి ఝలక్ ఇచ్చారు.కాంగ్రెస్ రాయబరెలీ ఎమ్మెల్యే, గాంధీ పరివారానికి అత్యంత సన్నిహితురాలైన అదితీ సింగ్ సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 Aditi Singh Fire On Priyanka Gandhi, Congress, Priyanka Gandhi, Adithi Singh, S-TeluguStop.com

వలస కూలీల నిమిత్తమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బస్సులు చాలా చిన్నవిగా ఉన్నాయని, అయినా అసలు చెత్త బస్సులు పంపారు అంటూ కాంగ్రెస్ పార్టీ ని ఏకిపారేశారు.‘‘ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? వెయ్యి బస్సులు వలస కూలీల సౌకర్యార్థం పంపుతున్నామని చెప్పి,అందులో సగ భాగం బస్సులవి తప్పుడు నెంబర్లు.297 చెత్త బస్సులు.

98 ఆటోరిక్షాలు.

అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి.మరో 68 బస్సులకు అసలు పేపర్లే లేవు.

ఇంత క్రూరమైన, జోకులు చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు.అయినా మీ దగ్గర బస్సులుంటే వాటిని రాజస్తాన్, పంజాబ్, మహారాష్ట్రకు ఎందుకు పంపలేదు అని ట్విట్టర్ వేదికగా అదితీ సింగ్ ఏకిపారేశారు.

యూపీకి చెందిన విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటలో ఇరుక్కుపోయిన సమయంలో ఈ బస్సులెక్కడున్నాయని ఆమె సూటిగా ప్రశ్నించారు.కోటలో ఇరుక్కుపోయిన విద్యార్థులను తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులను తమ తమ ఇళ్ల వద్ద క్షేమంగా వదిలిపెట్టకుండా, సరిహద్దుల్లో విడిచిపెట్టి అమానుషంగా ప్రవర్తించారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారి కోసం బస్సులను పంపి క్షేమంగా గమ్యస్థానాలను చేర్చారని, ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారంటూ ఆమె పేర్కొనడం గమనార్హం.సొంత పార్టీనే తీవ్ర స్థాయిలో విమర్శించిన అదితిసింగ్ మరో సారి వార్తల్లో నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube