ప్రియాంక చోప్రా డ్రస్ పై ట్రోలింగ్.. గర్భవతి అయ్యావా అంటూ?

ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

 Priyanka Chopra Trolling On Dress To Get Pregnant, Priyanka Chopra, Bollywood, D-TeluguStop.com

తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.హాలీవుడ్ లో కూడా తన హవా ఏంటో చూపిస్తుంది.

మొత్తానికి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ప్రియాంక చోప్రా.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఆమె హాట్ ఫోటోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈమె అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈమధ్య ప్రియాంక చోప్రా బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.ముఖ్యంగా తను షేర్ చేస్తున్న ఫోటోల పట్ల వైరల్ గా మారుతుంది.

వెరైటీ డ్రెస్సులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.నిజానికి తన అందంతో అందర్నీ మైమరిపించిన ప్రియాంక ఈమధ్య తన అందం విషయంలోనే ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ తన డ్రెస్ పై ట్రోలింగ్ ఎదుర్కొంది.అంతేకాకుండా గర్భవతి అయ్యావా అంటూ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.

లండన్ లో జూలై 10 న ఆష్లీ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రియాంక చోప్రా తన స్నేహితురాలు నటాషా పూణేవాలాతో కలిసి హాజరయ్యింది.ఇక ప్రియాంక డ్యూక్ అండ్ డచ్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్, టెన్నిస్ లెజెండ్ మార్టినా నవత్రిలోవా, బిల్లీ జీన్ కింగ్ వాళ్లతో కలిసి కూర్చుంది.

ఇక అక్కడ ప్రియాంక ముఖం నుంచి కాళ్ళ పాదాల వరకు ముసుగు వేసుకున్నట్లు డ్రెస్ ధరించగా ఓ రేంజ్ లో ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.

Telugu Bollywood, Pregnant, Priyanka Chopra-Movie

నిజానికి ప్రియాంక పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎంతో హాట్ గా రెడీ అవుతుంది.కానీ ఇప్పుడు ఇలా వచ్చేసరికి రకరకాల కామెంట్స్ ఎదుర్కొంటుంది.నెటిజన్లు ఆమెను చూసి ఇలాంటి డ్రెస్ తో కనిపిస్తుందేంటి అని షాక్ అవుతున్నారు.

ఇక ఆమెకు టెస్ట్ లేదంటూ, ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనర్ ను పెట్టుకోవాలి అంటున్నారు.అంతే కాకుండా హెయిర్ స్టైల్ చూస్తే తెగ నవ్వొస్తుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఓ నెటిజెన్.ఆమె గర్భవతినా.

ప్రెగ్నెన్సీని దాచుకోవడానికి ఇలాంటి డ్రెస్ వేసిందా అంటూ అనుమానంతో ప్రశ్నించాడు.మొత్తానికి ప్రియాంకాకు టేస్ట్ లేదంటూ గట్టిగా చెప్పేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube