అమెరికాలో దుకాణం పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది.అయితే ఎక్కువగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది.

 Priyanka Chopra Starts Restaurant In New York, Priyanka Chopra, Restaurant, New-TeluguStop.com

గతంలో క్వాంటమ్ అనే వెబ్ సిరీస్‌లో హాట్ అందాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించిన ఈ బ్యూటీ, ఇప్పుడు అమెరికాలో సొంత దుకాణం పెట్టి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇప్పటికే అమెరికాలో ఖరీదైన సొంత బంగ్లా కొనుక్కున్న ప్రియాంక, ఇప్పుడు ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది.

న్యూయార్క్‌లో ‘సోనా’ అనే పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ప్రియాంక, దీనికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది.తను మూడేళ్లుగా ఈ రెస్టారెంట్ కోసం కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

న్యూయార్క్‌లో తన సొంత రెస్టారెంట్‌కు ఇండియన్ డిజైనర్స్ పని చేసినట్లు ప్రియాంక తెలిపింది.ఇక ఈ రెస్టారెంట్‌లో తనకు ఓ ప్రత్యేక డైనింగ్ రూమ్‌ను కూడా పెట్టుకుంది ఈ బ్యూటీ.

తన గుండెకు దగ్గరగా ఈ రెస్టారెంట్ ఉంటుందని ఆమె అంటోంది.ఇక ప్రియాంక రెస్టారెంట్‌ను చూసేందుకు ఆమె అభిమానులతో పాటు ఆమె సన్నిహితులు వస్తున్నారు.

నిక్ జోనస్‌తో పెళ్లి తరువాత ప్రియాంక అమెరికాలోనే స్థిరపడింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధిస్తూ అభిమానులను అలరిస్తోంది.

ఏదేమైనా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక ఇలా అమెరికాలో సొంత వ్యాపారం మొదలుపెట్టడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాపారంలో ఆమెకు లాభాలు రావాలని ప్రియాంక ఫ్యాన్స్ కోరుతున్నారు.

మరి ప్రియాంక చోప్రా తిరిగి బాలీవుడ్‌లో ఎప్పుడు, ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తుందో, ఇస్తే ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube